విశాఖ పట్నంలో సందడిగా సాగిన విశాఖ ఉత్సవ్ లో ఓ తమాషా దృశ్యం ఆవిష్కృతమైంది. సాధారణంగా కలెక్టర్ అంటే చాలా సీరియస్ గా కనిపిస్తారు. ఒకవేళ ఎంటర్ టైన్ మెంట్ ప్రోగ్రామ్ కు వచ్చినా.. ముళ్లమీద కూర్చున్నట్టే ఉంటుంది. కానీ ఓ కలెక్టర్ మాత్రం.. తన టాలెంట్ తో ఏకంగా సినీ సంగీత దర్శకుడితోనే మెప్పుపొందారు. ఇక ఆ కలెక్టర్ భార్య గాత్రానికి సదరు మ్యూజిక్ డైరెక్టర్ ఫిదా అయ్యారు. తన తదుపరి సినిమాలో పాట పాడే ఛాన్స్ ఇస్తానని ప్రామిస్ చేశారు.

 

విశాఖ జిల్లా కలెక్టర్ వినయ చంద్ సతీసమేతంగా పాటలు పాడి విశాఖ ఉత్సవ్‌లో సందడి చేశారు. సంగీత దర్శకుడు తమన్ వారి టాలెంట్ కు అబ్బురపడ్డారు. పాట పూర్తికాగానే ఆ కలెక్టర్‌ దంపతులను సత్కరించారు. రెండు రోజులు పాటు విశాఖ వాసులను అలరించిన విశాఖ ఉత్సవ్ ఘనంగా ముగిసింది. ఈ వేడుకను సీఎం ప్రారంభించారు. సుప్రసిద్ధ సంగీత దర్శకుడు తమన్ సంగీత విభావరితో ఉత్సవాలు ముగిశాయి.

 

దేవి శ్రీప్రసాద్, తమన్ సంగీత వీనుల విందు నడుమ ఉత్సవం సాగింది. సరిలేరు నీకు ఎవ్వరు ఆడియో లాంచ్, వెంకీ మామ చిత్ర ప్రమోషన్ తో సినీ తారలు విశాఖ ఉత్సవ్ లో తళుక్కుమనిపించారు. విశాఖ ఉత్సవ మొదటి రోజు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తన పాటలతో హుషారేకించారు. అనుదీప్ పాటలు, లక్ష్మి ప్రశాంత్ శాస్త్రీయనృత్యం సాంస్కృతిక కార్య కార్య క్రమాలు అలరించాయి. లేజర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక్కడే సరిలేరు నీకెవ్వరూ చిత్ర ఆడియో లాంచ్ కూడా జరిగింది.

 

 

చిత్ర సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ను చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడిని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ సత్కరించారు. మొత్తం మీద రెండో రోజు రామకృష్ణ బీచ్ లో విశాఖ ఉత్సవ్ వేదిక పై సాంస్కృతిక కార్యక్రమాలు అద్యంతం మధురానుభూతినిచ్చాయి. ముగింపు వేడుకలో తమన్ మూడు గంటల పాటు తన పాటల హోరుతో విశాఖ ఉత్సవ్ హుషారు ఇచ్చారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు సంగీత దర్శకులు ఎస్ ఎస్ థమన్ ను వ్యాఖ్యాత సుమ, గాయని గీత మాధురి, గాయకులు శ్రీ కృష్ణ,సింహ,దర్శకులు బాబీలను ఘనంగా సత్కరించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: