చంద్రబాబు నాయుడికి 2019 వ సంవత్సరం కలిసిరాలేదని చెప్పాలి. 2014 లో అధికారంలోకి వచ్చిన తరువాత తెలుగుదేశం పార్టీ ఎన్నో కార్యక్రమాలు చేయాలనీ అనుకుంది అందులో రాజధానిని భారీగా నిర్మించాలని, ప్రపంచంలోని టాప్ 5 లో అమరావతి కూడా ఒకటి కావాలని అనుకుంది.  కానీ, అనుకున్నది ఒకటి అక్కడ జరిగింది మరొకటి అయ్యింది.  


దీనికి అనేక కారణాలు ఉన్నాయి.  అమరావతి నిర్మాణం జరగాలి అంటే కనీసం లక్ష కోట్ల రూపాయలు కావాలి.  ఎంతడబ్బు ఇప్పుడు ప్రభుత్వం దగ్గర లేదు.  ఇకపోతే 2018 లో తెలుగుదేశం పార్టీ బీజేపీతో వైరం పెట్టుకుంది.  హోదా కంటే ప్యాకేజీ ముద్దు అని చెప్పిన చంద్రబాబు ఆ తరువాత ప్యాకేజీ కాదు ప్రత్యేక హోదా కావాలని తెరమీదకు తీసుకొచ్చాడు.  ఇది బాబు చేసిన తప్పిదాల్లో ఒకటి.  


అంతేకాదు, కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు.  అసలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ తెలుగుదేశం.  అలాంటిది ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని పెద్ద తప్పు చేసింది.  ఎన్టీఆర్ పార్టీకి పెద్ద అవమానం జరిగినట్టు అయ్యింది.  అలానే ప్రజాధాన్ని చంద్రబాబు నాయుడు వృధా చేశారు.  ఎన్నికల కోసం భారీగా ఖర్చు చేశారు.

 
కాగా, ఆర్టికల్ 370 రద్దు సమయంలో కేంద్రానికి అనుకూలంగా మాట్లాడిన బాబు, ఇప్పుడు ఎంపీఆర్ విషయంలో వ్యతిరేకిస్తున్నారు.  అలానే ఎన్ఆర్సి కి కూడా వ్యతిరేకం అని చెప్తున్నారు.  మైనారిటీల సంక్షేమమే ముద్దు అని అంటున్నారు.  ఇలా బాబు తప్పుమీద తప్పులు చేస్తూ పార్టీని అధోగతి పాలు చేస్తున్నారు.  దీని వలన వచ్చే ఇబ్బందులు చాలా ఉంటాయి. ఆ ఇబ్బందులను ఇప్పుడు బాబు అధికమించాలి అంటే ఎలాంటి కష్టం వస్తుందో చెప్పక్కర్లదు.  బాబు చేసిన పనుల వలన పార్టీ మొత్తం ఇబ్బందుల్లో పడిపోతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: