ఎల్లో మీడియా..వైసీపీ నేతలు తరచూ వాడే పదం ఇది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఏబీఎన్, ఈటీవీలను ఎల్లో మీడియా అంటూ ఆ పార్టీ నేతలు తరచూ మీడియాలో మాట్లాడుతుంటారు. ఆ పార్టీ అధినేత జగన్ మొన్నటి ఎన్నికల ప్రచారంలో ఎన్నోసార్లు.. ఈ మీడియాను పేరు పెట్టి మరీ విమర్శించారు. ఇప్పుడు తాజాగా అమరావతి రైతుల ధర్నాల సమయంలో మీడియాపై జరిగిన దాడి ఘటన తర్వాత మరోసారి ఈ మీడియాపై వైసీపీ మండిపడుతోంది.

 

అమరావతిలో రైతుల ధర్నా, కన్నా లక్ష్మీనారాయణ మౌనదీక్షను కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులపై దాడి చేయడం కలకలం రేపింది. ఈ దాడిలో మహిళా జర్నలిస్టులు కూడా గాయపడ్డారు.ఈ తీరును ఏపీ సమాచారశాఖ మంత్రి ప్రశ్నించారు. తోటి జర్నలిస్టులపై విచక్షణారహితంగా దాడులు చేస్తే పత్రికా సమాజం, సంఘాలు ఏమయ్యాయని మంత్రి పేర్ని నాని నిలదీశారు. కొందరు తెలుగుదేశం అభిమానులు సోషల్‌ మీడియా యాక్టివిస్టులు మీడియాపై దాడిని సమర్థిస్తూ పోస్టులు పెడుతున్నారని పేర్ని నాని మండిపడ్డారు.. టీవీ 9 మేం చెప్పినట్లు వార్తలు రాయడం లేదని పోస్టులు పెడుతున్నారన్నారు.

 

ఇదే సమయంలో కాస్త ఘాటుగానే మాట్లాడారు పేర్ని నాని. టీవీ5, ఏబీఎన్‌, ఈటీవీని ఎప్పుడైనా వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు ఏమైనా చేశారా? అంటూ ప్రశ్నించారు.ఇటువంటి దుర్మార్గమైన చర్యలను సమర్ధించే ప్రవర్తనను మానుకోవాలని హితవు పలికారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 33 వేల ఎకరాలను బలవంతంగా తీసుకున్నారు. ఆ సమయంలో టీడీపీ నేతలను నిలదీస్తే 78 మందిపై కేసులు పెట్టారు. సీపీఐ, సీపీఎం, వైయస్‌ఆర్‌సీపీ నాయకులపై కేసులు పెట్టారు. విలేకరులకు, యాజమాన్యానికి సంబంధం ఏముందని ప్రశ్నించారు నాని.

 

రైతులైతేనేమి విలేకరులను కొడతారా? చంద్రబాబు బస్సులో వెళ్తే ఒక రాయి పడిందని గగ్గోలు పెట్టారు. ఇవాళ విలేకరులను ఎందుకు కొట్టారు. రైతులు శాంతియుతంగా నిరసన తెలుపుతారు. మనిషి కష్టం తెలిసిన వారు రైతులు. ఇవాళ విలేకరులను కొట్టిన వారిపై సాక్షాలు ఉన్నాయి. ఇలాంటి దాడులు ఖండిస్తున్నామన్నారు పేర్నినాని పేర్కొన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: