కొత్త సంవత్సరం కదా అన్ని పక్కన పెట్టి నూతన సంవత్సరం వేడుకల్లో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా.. చేయండి తప్పులేదు.  చేసే ముందు అన్నింటిని ఒక్కసారి సరిచూసుకోండి.  మన లెక్కలు అన్ని సరిగా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోండి.  ఎందుకంటే, చాలామంది ఐటి రిటర్న్ ను దాఖలు చేయలేదు.  మార్చి 31 వరకు ఐటి రిటర్న్ దాఖలు చేయని వాళ్లకు ఆగష్టు 31 వరకు సమయం ఇచ్చింది.


దానిని తిరిగి డిసెంబర్ 31 వరకు పొడిగించింది.  డిసెంబర్ 31 వ తేదీలోపుగా ఐటి రిటర్న్ దాఖలు చేయాలి.  ఇలా దాఖలు చేస్తే రూ. 5000 జరిమానా కట్టి దాఖలు చేయాలి.  అందుకే చాలామంది ఐటి రిటర్న్ ను ఇప్పుడు ఎందుకులే వచ్చే ఏడాది చూసుకుందాం.  వచ్చే ఏడాది మార్చి 31 వ తేదీలోపుగా దాఖలు చెయ్యొచ్చులే అనుకుంటూ ఉంటారు.  


ఇలా పోస్ట్ ఫోన్ చేసుకుంటే... దాని వలన మీ అకౌంట్ కు 10వేళా రూపాయలు లాస్ వచ్చినట్టే అనే విషయం గుర్తు పెట్టుకోండి.  డిసెంబర్ 31 వ లోపుగా టాక్స్ కడితే ఐదువేలు మాత్రమే జరిమానాతో పోతుంది.  ఈ ఒక్కరోజు దాటిందంటే పదివేలు ఫైన్ కట్టాల్సి వస్తుంది.  అంటే డబుల్ జరిమానా కట్టాలి.  అలా డబుల్ జరిమానా కట్టాలి అనుకునే వ్యక్తులు హ్యాపీగా వచ్చే ఏడాది వరకు ఐటిని అంటిపెట్టుకోవచ్చు.  


అలా కాకుండా ఐదువేలు ఎందుకు కట్టాలి అనుకుంటే మాత్రం ఈరోజు సాయంత్రం లోపుగా ఐటి రిటర్న్ చేయండి.  ఐదువేలు లాస్ కాకుండా చూసుకోండి.  చాలామంది వ్యక్తులు ఐటిని తప్పించుకోవాలని చూస్తుంటారు.  అలా తప్పించుకోవడానికి ఇప్పుడు కేంద్రం దారులు మూసేసింది.  ప్రతి ఒక్కరు విధిగా టాక్స్ కట్టేలా చూస్తున్నది.  ఎప్పటి కప్పుడు టాక్స్ కట్టుకుంటే జరిమానాల నుంచి బయటపడొచ్చు.  టాక్స్ కు ఎగనామం పెడితే మాత్రం ఇబ్బందులు తప్పవు.  

మరింత సమాచారం తెలుసుకోండి: