ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 51,488 మంది ఆర్టీసీ కార్మికుల కల నెరవేరింది. ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వం నోటిఫికేషన్ లో జనవరి 1వ తేదీని అపాయింట్ మెంట్ డేగా పరిగణిస్తూ జారీ చేసింది. ప్రభుత్వ ఖజానా నుండి ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా జీతాలు తీసుకోనున్నారు. ఈ నోటిఫికేషన్ ను ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ చట్టం 2019 ప్రకారం విడుదల చేసింది. 
 
ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ప్రజా రవాణా ఉద్యోగులుగా ఆర్టీసీ కార్మికులను పరిగణిస్తూ ఆదేశాలను జారీ చేసింది. ఫిబ్రవరి 1వ తేదీ నుండి ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే ఆర్టీసీ కార్మికులు నేరుగా ఖజానా నుండి జీతాలను అందుకోనున్నారు. రేపటి నుండి ఆర్టీసీ సిబ్బంది ప్రజా రవాణా ఉద్యోగులుగా మారనున్నారు. దేశంలో కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్టంలో మాత్రమే ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేశారు. 
 
51,488 మంది ఆర్టీసీ కార్మికుల కలను సీఎం జగన్ నెరవేర్చారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలను ప్రజారవాణాశాఖలో విలీనమైన వెంటనే చెల్లించే విధంగా ఏర్పాట్లు చేసింది. కొన్ని రోజుల క్రితం ఏపీ అసెంబ్లీ ఆర్టీసీ ఉద్యోగుల విలీన బిల్లుకు ఆమోదం తెలిపింది. సీఎం జగన్ అసెంబ్లీలో జనవరి నెల 1వ తేదీ నుండి ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా చలామణి అవుతారని జగన్ ప్రకటించారు. 
 
ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల కోసం 3600 కోట్ల రూపాయలు భరించనుందని తెలుస్తోంది. సీఎం జగన్ అసెంబ్లీలో ప్రతి ఉద్యోగి సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటూ చిరునవ్వుతో ఈ కార్యక్రమం చేస్తున్నానని తెలిపారు. ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడంతో ఆర్టీసీ కార్మికులు ఇకనుండి ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల రిటైర్మెంట్ వయస్సును 58 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలకు పెంచిన విషయం తెలిసిందే. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: