రాజకీయ నాయకులు ఇటీవల తమ పేరు పది కాలాలు నిలిచిపోవాలన్న చిన్న దురాశతో ఎంతటి కార్యానైనా సరే చేసేందుకు తెగవబడుతున్నారు. ఈ విషయంలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నారా చంద్రబాబు నాయుడును ప్రధానంగా పేర్కొనవచ్చు. ఏ పాటి పని చేసిన దానికి ప్రచార్భాటం చేయడంలో ఆయనకు ఆయనే సాటి. ఆశించినకొద్దీ కీర్తి దూరమవుతుంటుంది. దాన్ని మరిచిపోయినకొద్దీ మనకు దగ్గరవుతుంటుంది. ఇది అక్షరాలా చంద్రబాబు విషయంలో జరిగింది. ఈ సందర్బంగా ఆస్కార్‌ వైల్డ్‌ అన్న మాటను ఒకసారి గుర్తు చేసుకొద్దాం.. ‘పేరు ప్రతిష్ఠలు కావాలంటే చాలా కాలం పడుతుంది. పోగొట్టుకోవడానికి క్షణం పట్టదని వైల్డ్ అన్నారు. కార్లయిల్‌ కూడా ‘ఆశించకుండా లభించే కీర్తి అపురూప వస్తువు వంటిది’ అంటాడు  ’ అంటాడు. 


మంచిపేరు కావాలంటే..
మంచిపేరు తెచ్చుకోవాలని ప్రతి మనిషికీ ఉంటుంది. ఆశించినంత మాత్రాన కీర్తి రాదు. ధర్మాచరణ, చిత్తశుద్ధి, సచ్ఛీలం వల్ల మంచిపేరు వస్తుంది. మంచి మనసులేని అందం, వాసన లేని పువ్వు, క్రమశిక్షణ లేని చదువు, సదాశయం లేని యుద్ధం, ఆచరణలేని సూక్తులు, మనిషికి ఖ్యాతి తెచ్చిపెట్టలేవు’ అంటారు స్వామి వివేకానంద. అందుకే అంటారు మన పెద్దలు..  ప్రచారం కోసం చేసే దానధర్మాలకంటే మనఃపూర్వకంగా చేసే గుప్తదానాలే మనిషికి అఖండ ఖ్యాతిని తెచ్చిపెడతాయని. పేరు తెచ్చుకోవడమంటే- కీర్తి సంపాదించడం, ప్రసిద్ధి పొందడమే. కోరుకుంటే, డబ్బు ఖర్చుపెడితే, పరులను స్తోత్రపాఠాలతో సంతోషపెడితే, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రచారాలు చేసుకుంటే వచ్చే కీర్తి, అభినందన, స్తుతి అర్థవంతమైనవి కావు. తన సాధన, కృషి, విజయం, దీక్ష, అధ్యయనం ఇతరులకు స్ఫూర్తిని, ప్రోత్సాహాన్ని, చైతన్యాన్ని కలిగిస్తే అది తప్పకుండా మనిషికి ఖ్యాతిని తెచ్చిపెడుతుంది. అది ప్రాచుర్యానికి, పదిమందికి చెప్పుకోవడానికి అర్హత కలిగినదే అవుతుంది. మంచిమాట, మంచిపని, ఇతరులకు సేవచేసే లక్ష్యం శాశ్వత కీర్తిని సంపాదించి పెడతాయి. 


 ప్రచారం కోసం తగదు..
జాతికి ప్రయోజనకరమైన ఏ పని అయినా మనిషికి కీర్తి తెచ్చిపెడుతుంది. సాటి మనిషికి స్ఫూర్తిని, ఉత్సాహాన్ని, సత్సంకల్పాన్ని కలగజేయలేని ఏ పనీ ప్రచారానికి అర్హమైంది కాదు. అటువంటి పనుల గురించి మనిషి బయట చెప్పుకోవడమూ అల్పజ్ఞతే అవుతుంది. అరవిందుడు, సిస్టర్‌ నివేదిత, మదర్‌ థెరెసా జాతిహితం కోసం తమ జీవితాలనే అంకితం చేశారు. ఖ్యాతి వారిని వరించింది. చరిత్ర తన స్వర్ణపుటల మీదకు వారిని ఆహ్వానించింది. కీర్తి వైపు చూస్తూ కృషి చేయడం కాదు, కృషిని చూసి కీర్తి పరుగెడుతూ రావాలి. చరిత్రకెక్కిన మహనీయులంతా అలాగే చేశారు. చిరస్థాయిగా మన గుండెల్లో నిలిచిపోయారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: