చరిత్రలో చూసుకుంటే ప్రతిరోజు ఎంతో మంది ప్రముఖులు జన్మించి ఉంటారు. ఇప్పుడు వారు మన మధ్య లేకపోయినా ఇప్పటికీ వారి పుట్టిన రోజులు మాత్రం ఎప్పటికీ జరుపుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈ ప్రముఖులందరూ చరిత్రలో నిలిచిపోయేలా ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇంతకీ జనవరి 2 న జన్మించిన వారెవరు ఇప్పుడు చూద్దాం రండి. 

 

 

 

 ఏవీఎస్ జననం : ప్రముఖ హాస్య నటుడు ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం 1957 జనవరి 2వ తేదీన తెనాలిలో జన్మించారు. తెలుగు ప్రేక్షకులందరికీ ఏవిఎస్ గా కొసమెరుపు. సినిమాల్లో కమెడియన్ గా నటించి తనదైన స్టైల్ కామెడీతో తెలుగు అభిమానులను సంపాదించుకున్నారు ఏవీఎస్. ఒక కమిడియన్  గానే కాకుండా సినీ రచయితగా నిర్మాతగా కూడా తెలుగు కళామతల్లికి సేవలందించారు ఏవీఎస్. ఎంతో మంది ప్రేక్షకులను తన కామెడీతో కడుపుబ్బా నవ్వించడమే  కాకుండా ఎంతో మంచి మంచి సినిమాలను నిర్మించి తెలుగు ప్రేక్షకులను అందించాడు . ఎన్నో అవార్డులు రివార్డులను సైతం సొంతం చేసుకున్నారు. 2013 నవంబర్ 18న హైదరాబాద్ లో తుది శ్వాస విడిచారు ఆయన .

 

 

 ఆహుతి ప్రసాద్ జననం : తెలుగు చిత్ర పరిశ్రమలో క్యారక్టర్ ఆర్టిస్టుగా ఆహుతిప్రసాద్ ప్రేక్షకులందరికీ కొసమెరుపు. తండ్రిగా, తాతగా,  విలన్ గా ఇలా ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు ఆహుతి ప్రసాద్. ఎన్నో సినిమాల్లో ముఖ్య పాత్రల్లో  నటించి ఎన్నో అవార్డులు సైతం సొంతం చేసుకున్నారు. ఏ పాత్రలో నటించిన ఆ పాత్రలో జీవించి మరి నటించేవాడు. 1958 జనవరి 2వ తేదీన ఆహుతిప్రసాద్ జన్మించగా... 2015 సంవత్సరంలో మరణించారు.

 

 

 మాజీ క్రీడాకారుడు కీర్తి ఆజాద్ జననం : జనవరి 2, 1959 సంవత్సరంలో బీహార్ లో జన్మించారు. భారత క్రికెట్ జట్టులో కీలక ఆటగాడిగా  ఎన్నో భాషల్లో అద్భుత బ్యాటింగ్ చేసి టీమిండియాను విషయాల వైపు నడిపించారు. అయితే క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత క్రికెట్ వ్యాఖ్యాత గా మారిపోయాడు ఈయన. కానీ సునీల్ గవాస్కర్ రవిశాస్త్రి లాగా ఎక్కువ కాలం నిలదొక్కుకోలేక పోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: