ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి తన  నోటికి పనిచెప్పారు . ప్రభుత్వం తరుపున ఆయనే విపక్షానికి సమాధానము చెబుతూ , అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. రాష్ట్ర రాజధాని భూముల్లో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని మొదటి నుంచి వైకాపా నేతలు ఆరోపిస్తున్న విషయం తెల్సిందే . అయితే ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగినట్లు నిరూపించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తూ వచ్చారు . దీనితో రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది . ఈ నేపధ్యం లో రాజధాని భూముల్లో ఇన్ సైడ్ ట్రేడింగ్ పై తమ్మినేని స్పందిస్తూ  రాష్ట్ర రాజధాని భూముల్లో ఇన్ సైడ్ ట్రేడింగ్ కు పాల్పడిన వారిపై త్వరలోనే చర్యలు తీసుకుంటామని అన్నారు .

 

 టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎందుకంత తొందరా? అని ప్రశ్నించిన ఆయన  రాజధాని   ఏర్పాటు చేయడమంటే , ఇన్ సైడ్ ట్రేడింగ్ కు పాల్పడినట్లు కాదన్నారు . ఇక వాన్ పిక్ భూముల్లో కుంభకోణం జరిగిందన్న ప్రశ్నకు తమ్మినేని స్పందిస్తూ  అధికారం లో ఉన్నన్ని రోజులు టీడీపీ నేతలు పడుకున్నారా? అంటూ ఎద్దేవా చేశారు . అంతటితో ఆగని తమ్మినేని, టీడీపీ ఒక ప్రతిపక్ష పార్టీ ...  చంద్రబాబు  ఒక నాయకుడు అంటూ అపహాస్యం చేశారు . ఉత్తరాంధ్ర లో రాజధాని కోసం ఏ పోరాటానికైనా సిద్ధమేనని తమ్మినేని సీతారాం అన్నారు . ఇక విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు ను చంద్రబాబు సమర్థిస్తారా ?, లేదా ?? చెప్పాలని డిమాండ్ చేశారు .

 

 విశాఖను పరిపాలన రాజధాని చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని రాజధాని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు . రాజధానిని తరలిస్తే తమ పరిస్థితి అధ్వానంగా   తయారవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక మూడు రాజధానులను ప్రతిపాదించిన రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత స్థాయి కమిటీ ని ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే .

మరింత సమాచారం తెలుసుకోండి: