తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయర్ వేడుకలను అన్ని వర్గాల ప్రజలు ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. సెలబ్రిటీలు, రాజకీయనాయకులు కూడా తమ తమ శైలిలో 2020 సంవత్సరానికి స్వాగతం పలికారు. ఈ క్రమంలో ఇరు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్నారు. వీరంతా ఆయా రాష్ట్ర ప్రజల సుఖసంతోషాలను కాంక్షిస్తే.. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఏపీలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రం తన రాజకీయ మైలేజి పెంచుకునేందుకు న్యూ ఇయర్ అకేషన్ ను అడ్డుపెట్టుకుంటున్నారన్న వ్యాఖ్యలు లేకపోలేదు. ముఖ్యంగా అమరావతి నుంచి రాజధానిని తరలింపు ప్రతిపాదన అంశాన్ని సాకుగా చేసుకుని రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శ లేకపోలేదు. బాబొరి వ్యవహార సరళి ఇలా ఉంటే.. ఇరు రాష్ట్రాల్లో ఈ వేడుకలు హుందాగా జరిగాయి.  

తెలంగాణలో..
తెలంగాణ రాజ్ భవన్ లో గవర్నర్ తమిళ సై సౌదర్యం రాజన్ పుర ప్రముఖుల మధ్య జరుపుకున్నారు. ఈ వేడుకల్లో రాజకీయ ప్రముఖులు, అధికార వర్గాలు, వ్యాపార వర్గాలు పాల్గొన్నారు.  అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్  రాజ్‌భవన్‌లో కూడా  నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కు చిన్నారులు పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో రాష్ట్ర ప్రజలందరికీ సుఖ సంతోషాలు కలగాలని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆకాంక్షించారు. అలాగే టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, డాలర్‌ శేషాద్రిలు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. గవర్నర్‌ విశ్వభూషణ్‌కు టీటీడీ అర్చకులు ఆశీర్వచనాలు అందజేశారు. అంతకు ముందు గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌.. రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అందరూ అభివృద్ధి సాధించాలని, జగన్నాథస్వామి, తిరుమల వెంకటేశ్వరస్వామి, కనకదుర్గమ్మ చల్లని దీవెనలతో రాష్ట్రమంతటా శాంతి సామరస్యాలు వెల్లివిరియాలని కోరుకుంటున్నట్టు  గవర్నర్‌ తెలిపారు. 

ప్రజలకు వరాల జల్లు..
నూతన సంవత్సరం సందర్భంగా ముఖ‍్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి టీటీడీ అర్చకులు ఆశీర్వచనాలు అందించారు. తాడేపల్లిలోని నివాసంలో ముఖ్యమంత్రికి  వేదపండితులు ఆశీర్వచనాలు ఇచ్చి శ్రీవారి తీర్ధప్రసాదాలు, శేష వస్త్రాలను అందచేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, దేవాదాయా శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు.  ఈ సందర్బంగా సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు వరాల జల్లు కురిపించారు. ముఖ్యంగా  సంక్షేమ పధకాలపై తన నిర్దుష్టమైన వెల్లడించారు. పాదయాత్రలో ప్రజలకిచ్చిన హామీలను క్రమంలో అమలులోకి తీసుకొస్తున్నారు.  

ఉచితంగా లడ్డూ..

ఇదిలా  ఉండగా టిటిడిలో 2020 ఆంగ్ల నూతన సంవత్సరంలో శ్రీవారిని దర్శించుకున్న ప్రతి ఒక్కరికి ఉచిత లడ్డూను అందచేయాలని టీటీడీ నిర్ణయించింది. ప్రస్తుతం అలిపిరి, శ్రీవారి మెట్లు మార్గాల నుంచి కాలినడకన తిరుమల వచ్చే భక్తులకు మాత్రమే ఒక ఉచిత లడ్డూను టీటీడీ అందచేస్తోంది. ఆ మేరకు ప్రతి రోజు 20వేల లడ్డూలను అందిస్తోంది. నూతన ప్రతిపాదనలో భాగంగా తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడికి ఒక లడ్డూను ఉచితంగా అందచేయనుంది. ఈ విధానాన్ని వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 6 నుంచి అమలులోకి తీసుకురానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: