అమరావతిపై రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహ రెడ్డి  సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. రాజధాని విషయంలో తన నిర్ణయాన్ని తెగేసి చెప్పారు. దానితో బాబొరి సరికొత్త టక్కు తామరాలకు సరైన సమాధాన చెప్పినట్టయ్యింది. ఏపీ రాజధానిగా అమరావతి ఏ మాత్రం సరిపోదని, రాజధానిని నిర్మించాలంటే రూ.లక్ష కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ అంటున్న విషయం తెలిసిందే. దాని బదులుగా విశాఖలో పరిపాలన సాగించి, ఆ నగరాన్ని డెవలప్ చేయాలని యోచిస్తున్నారు.

అయితే.. ప్రస్తుతం ఉన్న అమరావతిని ఏం చేయాలి? అక్కడ కట్టిన భవనాల సంగతి ఏంటి? అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ చెంతకు ఓ కీలక ప్రతిపాదన చేరినట్లు సమాచారం. అమరావతిలో సేకరించిన భూములన్నీ వ్యవసాయానికి సంబంధించినవే. అవన్నీ రైతుల వద్ద తీసుకున్నవే. అందుకే.. అమరావతిని ప్రత్యేక వ్యవసాయ జోన్‌గా ప్రకటిస్తే మేలని కొందరు నిపుణులు సీఎంకు సూచించినట్లు తెలిసింది. అమరావతి ప్రాంతాన్ని ప్రత్యేక అగ్రికల్చర్ జోన్‌గా మార్చాలని నివేదికతో కూడిన ప్రతిపాదనను వ్యవసాయ నిపుణులు సిద్ధం చేసినట్లు సమాచారం.

అక్కడ నిర్మాణాలు, రోడ్లు, భవనాలను యధాతథంగా ఉంచాలని నిపుణులు ప్రభుత్వానికి సిఫారసు చేశారట. పెరుగుతున్న జనాభా దృష్ట్యా.. వ్యవసాయం ముఖ్యమని, విశాఖను రాజధానిగా మార్చాలని యోచిస్తున్న నేపథ్యంలో.. విలువైన పంటలకు అమరావతిని హబ్‌గా మార్చితే మంచిదని, దానిలో రైతులకు భాగస్వామ్యం కల్పిస్తే బెటర్ అని నిపుణులు సీఎం జగన్‌కు ప్రతిపాదించారట.

ఆ భూమి మినహా మిగతా భూమినంతా స్పెషల్ అగ్రికల్చర్ జోన్(ఎస్ ఏ జెడ్)గా వినియోగించాలని నిపుణులు చెప్పడంతో, ఆ ప్రతిపాదనలపై ఏపీ సర్కారు కసరత్తు కూడా మొదలు పెట్టిందని సమాచారం. ల్యాండ్ పూలింగ్‌తో పాటు ప్రభుత్వ భూములను ఎస్ ఏ జెడ్ పరిధిలోకి తెచ్చే ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు సీఎం జగన్ జై కొడితే.. రాజధాని కాస్త వ్యవసాయ జోన్‌గా మారనుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: