వైఎస్ జగన్ విద్య, ఉద్యోగ రంగాలపై బాగా దృష్టి సారించారు. విద్య ఒక్కటే బడుగు, బలహీన వర్గాల వారి జీవితాలను మార్చేస్తుందని నమ్మే వ్యక్తుల్లో జగన్ మోహన్ రెడ్డి ఒకరు. అందుకే ఈ రెండు రంగాల కోసం ఆయన ఖర్చుకు వెనుకాడకుండా పథకాలు ప్రవేశపెడుతున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అమ్మ ఒడి పథకం ద్వారా ఏడాదికి 15 వేలు అందిస్తున్నారు.

 

అయితే పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన కళాశాలలు, ఫీజు రీంబర్స్ మెంట్ సౌకర్యం కారణంగా బాగా పెరిగిన విద్యార్థుల సంఖ్య కారణంగా నాణ్యత పూర్తిగా కొరవడంది. ఇంజినీరింగ్ విద్య పూర్తి చేసుకున్నా వారు ఉద్యోగంలోకి వెళ్తే.. వారి యజమాని తలపట్టుకోవాల్సిన పరిస్థితి అందుకే. ఈ పద్ధతిలో మార్పు తెచ్చేందుకు విద్యార్థులను ఉద్యోగాలకు పనికొచ్చేలా తీర్చిదిద్దేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు.

 

అందులో భాగంగానే డిగ్రీ విద్యను ఇప్పుడు మరో ఏడాది పెంచుతున్నారు. ఇంటర్న్ షిప్ విధానం డిగ్రీకి కూడా అమలు చేస్తున్నారు. దీని వల్ల మరో విద్యాసంవత్సరం పెరుగుతుంది. కానీ విద్యార్థికి ఇది చాలా ఉపయోగపడుతుంది. నాలుగేళ్ళకు డిగ్రీ కోర్సుని పెంచుతున్నారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె హేమచంద్రారెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు.

 

ఇక వచ్చే సంవత్సరం నుంచి డిగ్రీ లో చేరే వారికి ఇది వర్తిస్తుందని ఇంటర్‌ షిప్ తో కలిపి మొత్తం కోసం దీన్ని నాలుగేళ్ల ఇస్తారని హేమచంద్రారెడ్డి తెలిపారు. విద్యార్ధుల్లో నైపుణ్యం పెంచి ఉపాధి అవకాశాలు పొందేలా తీర్చిదిద్దడానికే ఉన్నతవిద్యామండలి ఈ నిర్ణయం తీసుకుంది.

 

 

చదువు పూర్తి అయి బయటకు వచ్చే విద్యార్ధికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వెంటనే ఉద్యోగం దొరకాలంటే కచ్చితంగా అప్రెంటీస్ షిప్ అవసరమని జగన్ బావిస్తున్నారు. డిగ్రీ తరహాలోనే ఇంజినీరింగ్ కూడా మరో సంవత్సరం పెరగబోతోంది. ఒక ఏడాది ఎక్కువ చదివితే పోయేదేమీ ఉండదు. కానీ అది భవిష్యత్ ను ఎంతగానో ప్రభావం చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: