ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సంగతి తెలిసిందే. మహా మూర్ఖశిఖా మణిలా ఉంటాడు. అణ్వస్త్ర సంపదను కూడ బెట్టుకుని ప్రపంచానికే ప్రమాదకరంగా మారుతున్నాడు. ఆయన పేరు చెబితే అమెరికన్ ప్రెసిడెంట్ కూడా ఉలిక్కిపడతాడు. అలాంటి ఉత్తర కొరియా అధినేత సంచలన ప్రకటన చేశాడు.

 

అణు పరీక్షలు, ఖండాంతర క్షిపణి ప్రయోగాలు జరపకుండా విధించుకున్న స్వీయ నిషేధాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ స్పష్టం చేశారు. కీలకమైన నూతన ఆయుధాన్ని ప్రదర్శించనున్నట్లు కూడా కిమ్ ప్రకటించారు. ఆంక్షల ఎత్తివేత చర్చలకు డిసెంబరు 31వరకూ కిమ్ కు అమెరికాకు గడువిచ్చింది.

 

 

కిమ్ అణ్వస్త్ర పరీక్షలు జరపబోమన్న నియంత్రణను ఇక పాటించాల్సిన అవసరం ఏమాత్రం లేదన్నారు. పార్టీ కేంద్ర కమిటీ పూర్తి స్థాయి సమావేశంలో విస్తృతంగా చర్చించిన కిమ్ తమ విధాన మార్పుపై నిర్ణయం తీసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ , కిమ్ మధ్య ఇప్పటికి 3 సార్లు సమావేశం జరిగింది. కానీ ఆంక్షల ఎత్తివేతపై ఎలాంటి పురోగతి కనిపించలేదు. అప్పటి నుంచి అమెరికాతో చర్చల కోసం కిమ్ ప్రయత్నించినా అగ్రరాజ్యమే ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో మళ్లీ అణ్వస్త్రాలకు పదును పెట్టాలని ఉత్తర కొరియా నిర్ణయించింది. మరి ఈ నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి. ఏం జరుగుతుందో ఏమో..

మరింత సమాచారం తెలుసుకోండి: