కొత్త సంవత్సరంలో ప్రపంచం కొత్తగా అడుగుపెట్టింది. 2020 వ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనే విషయం ఇప్పటికే స్పష్టం అయ్యింది. కొన్ని ప్రాంతాల్లో గొడవలు ఎందుకు అని చెప్పి సైలెంట్ గా ఉంటున్నారు.  అయితే, గత కొన్ని రోజులుగా ఇరాక్ దేశంలో ఎలాంటి గొడవలు జరుగుతున్నాయో చెప్పక్కర్లేదు.  ఈ గొడవల కారణంగా ఇరాక్ చాలా నష్టపోయింది.  అప్పట్లో సద్దాం ఉన్న రోజుల్లో అంతర్గత సమస్యలు ఉన్నా పెద్దగా బయటకు వచ్చేవి కాదు.  


ఎప్పుడైతే సద్దాం పై యుద్ధం ప్రకటించి అమెరికా సద్దాం ను ఉరితీసిందో అప్పటి నుంచే అక్కడ పరిస్థితులు మారిపోయాయి.  రాజకీయ అనిశ్చితి పెరగడంతో పాటుగా ఆ దేశంలో పరిస్థితులు పూర్తిగా అమెరికా చేతుల్లోకి వెళ్లాయి.  దీంతో అక్కడ అమెరికా ఆధిపత్యం పెరిగిపోయింది.  ఇటీవలే అమెరికాకు చెందిన కొంతమంది సైన్యాన్ని ఉపసంహరించుకుంది.  


ఇదిలా ఉంటె, అమెరికాకు... ఇరాన్ కు మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తె భగ్గుమంటోంది.  దీంతో పాటు అటు సౌదీకి ఇటు ఇరాన్ కు మధ్య కూడా గొడవలు వస్తున్నాయి.  అటు ఇరాక్ లో జరుగుతున్న అంతర్గత గోడలకు ఇరాన్ సపోర్ట్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్న తరుణంలో అమెరికా సైన్యం బాగ్దాద్ పై బాంబుల వర్షం కురిపించింది.  ఈ బాంబు దాడిలో ఇరాన్ సైనిక కమాండర్ మృతి చెందాడు.  


దీనిపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కొత్త సంవత్సరంలో అమెరికా తప్పుడు నిర్ణయాలు తీసుకుందని, తమ కమాండర్ ను హతమార్చి గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తకరమైన పరిస్థితులకు తెరతీసిందని ఇరాన్ ఆరోపిస్తోంది.  గల్ఫ్ లో ఎలాంటి గొడవలు జరిగినా దానికి అమెరికా బాధ్యత వహించాల్సి ఉంటుందని ఇరాన్ చెప్తోంది.  ప్రస్తుతం గల్ఫ్ లో ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి.  అటు ఇరాక్ తో పాటు ఇటు ఇరాన్ కు కూడా అమెరికా నష్టాన్ని కలిగించింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: