ప్రపంచంలో 19, 20 వ శతాబ్దాలు ఎన్నో యుద్ధాలను చూసింది. సాంకేతిక విప్లవాలను చూసింది.  వీటితో పాటుగా అనేక గొప్ప గొప్ప ఆవిష్కరణలు కూడా ఈ శతాబ్దంలోనే పురుడుపోసుకున్నాయి.  ఇలాంటి ఘనమైన ఆవిష్కరణలు సొంతం చేసుకున్న ఈ శతాబ్దంలో రెండు ప్రపంచయుద్ధాలు కూడా జరిగాయి.  ఇప్పుడు 21 వ శతాబ్దంలో మరో యుద్ధం జరగబోతుందా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి.  

 


ఒకవేళ మూడు ప్రపంచయుద్ధం వస్తే ఏ రూపంలో వస్తుంది... ఎలా వస్తుంది.  దానిని ఎదుర్కోవడానికి ఎలా సన్నద్ధం కావాలి అనే విషయాలు తెలియాల్సి ఉన్నది.  ప్రతి విషయంలో కూడా యుద్ధం వస్తుంది వస్తుంది అని భయపెడుతున్నారు.  ఒకవేళ ఇప్పుడు యుద్ధం వస్తే ప్రపంచం వినాశం తప్పదు.  ఎందుకంటే, ప్రపంచంలో దాదాపుగా అన్ని దేశాల వద్ద అత్యాధునిక మారణాయుధాలు ఉన్నాయి. 

 


ఎన్నో దేశాలు వాటి పక్క దేశాలతో శత్రుత్వాన్ని పెంచుకొని ఉన్నాయి.  ఈ సమయంలో మూడో ప్రపంచయుద్ధానికి దారులు తీస్తే ప్రపంచంలో చాలా వరకు అంతం అవుతుంది.  రెండో ప్రపంచ యుద్ధం తరువాత అమెరికా చాలా వేగంగా అభివృద్ధి చెందింది.  అణుబాంబులను తయారు చేసుకుంది.  రష్యాతో కోల్డ్ వార్ జరిగినా రష్యా అభివృద్ధి విషయంలో వెనుకబడిపోయింది.  రష్యా 11 దేశాలుగా విడిపోవడంతో ఆ దేశం చాలా వరకు వెనకబడింది.  


అయితే, ఇప్పుడు రష్యా మరలా తిరిగి పుంజుకుంటున్నది.  ఇక ఇదిలా ఉంటె గల్ఫ్ దేశాల్లో ఇప్పుడు అనేక అంతర్గత విభేదాలు ఉన్నాయి.  గల్ఫ్ దేశాల్లో చమురు నిక్షేపాలు ఉన్నాయి.  ఇక్కడి నుంచే ప్రపంచానికి కావాల్సిన చమురు ఎగుమతి అవుతుంది.  చూడటానికి గల్ఫ్ దేశాలు ఎడారి ప్రాంతాలే.. కానీ, ఆ ఎడారిలోనే ప్రపంచం వేగంగా ప్రయాణం చేయడానికి కావాల్సిన చమురు అందిస్తున్నది.  ఈ చమురు నిక్షేపాలపై అనేకమంది కన్నేశారు.  అమెరికాకు, ఇరాన్ కు మధ్య చాలా రోజులుగా గొడవలు జరుగుతున్నాయి.  కానీ, ఇరాన్ కుర్ద్ ఆర్మీ కమాండర్ ను అమెరికా దళాలు మట్టుపెట్టడంతో గల్ఫ్ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొన్నది.  అమెరికాపై ఇరాన్ చాలా కోపంగా ఉన్నది.  ఏ క్షణానైనా ఇరాన్ అమెరికాపై విరుచుకు పడొచ్చని వాదనలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: