అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు మాటల మంటలు రేపుతున్నాయి . అమరావతిలో  తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ మంత్రులు ఇన్ సైడర్ ట్రేడింగ్ కు  పాల్పడ్డారని వైస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఒక వీడియో ప్రజెంటేషన్ ద్వారా ఆరోపించగా , వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల మాటేమిటి ? అంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర్ రావు పలువురి పేర్లను ఉదహరించారు . వీరిద్దరూ మీడియా ఎదుట రాజేసిన అగ్గి ఇప్పుడు మాటల మంటలు రేపుతూ , సవాళ్లు , ప్రతి సవాళ్లు విసురుకునేస్థితికి వెళ్ళింది .

 

 ఒకరిద్దరు తమకు ఇన్ సైడర్ ట్రేడింగ్ తో సంబంధం లేదని సున్నితంగా చెబితే , మరి కొద్దరు మాత్రం మాటల తూటాలను పేల్చుతున్నారు . నీరుకొండ లో తన పేరిట ఐదు ఎకరాల భూమి ఉందన్న ఆరోపణలను ఖండించిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి , ఆ భూములెక్కడో చెబితే వారికే రాసిస్తానని , అలాగే భూములున్నట్లు నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవి కి స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేస్తానంటూ సవాల్ చేశారు . పెదకూరపాడు ఎమ్మెల్యే   కూడా రొటీన్ డైలాగ్ చెప్పేశారు . అలాగే టీడీపీ నేత కంభంపాటి కూడా తాను ఎప్పుడో కొన్నానని , దానికి రాజధానికి అసలు సంబంధమే లేదని తేల్చేశారు .

 

ఇక ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ తన కుటుంబ మూడు తరాల ఆస్తుల గురించి , ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబ మూడు తరాల ఆస్తుల గురించి ప్రకాశం బ్యారేజ్ వద్ద చర్చకు సిద్ధమని సవాల్ చేశారు . తన కుటుంబ ఆస్తులు ఎలా కరిగిపోయాయో, జగన్మోహన్ రెడ్డి కుటుంబ ఆస్తులు ఎలా పెరిగాయో రాష్ట్ర ప్రజలకు తెలుసునని అన్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: