కీచకులు పెరిగిపోయారు. నడి రోడ్డుపై రెచ్చిపోతున్నారు. అలాంటి వారికి మహిళా చైతన్యమే మందు.. జనం మధ్యలో జరిగే అరాచకాలకు భయపడకుండా ఎదురుతిరగాలి.. ఈ ఘటనను మరోసారి రుజువు చేసిందీ మహిళ. వివరాల్లోకి వెళ్తే.. సికింద్రాబాద్ వారాసిగూడలో నివాసముంటున్నఓ మహిళ మాదాపూర్‌లోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు.

 

ఈమె నాలుగు నెలల గర్భిణి. రోజు మాదిరిగానే గురువారం రాత్రి 8 గంటలకు ఆమె విధులకు వచ్చారు. అనంతరం రాత్రి 9 గంటల ప్రాంతంలో భర్త తన కంపెనీ వద్దకు రావడంతో ఇద్దరు కలిసి భోజనం చేసేందుకు సమీపంలోని వైఎస్ఆర్ చౌరస్తాకు వెళ్లారు. భోజనం అనంతరం భర్త ఇంటికి వెళ్లిపోయాడు.

 

కానీ.. ఆమె ఫోన్ మాట్లాడుతూ నడుచుకుంటూ సమీపంలో ఉన్న కంపెనీకి బయలుదేరారు. ఇంతలో ఎదురుగా వచ్చిన ఓ వ్యక్తి అకస్మాత్తుగా ఆమెపై చేయి వేశాడు. ఎక్కడెక్కడో తడమబోయాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ ఆమె.. అతడిని అడ్డగించింది. అతను ఆమెపై దాడికి దిగాడు. ఆమె ఏ మాత్రం భయపడకుండా.. అతడి పై ఎదురు దాడిచేసింది. పిడిగుద్దులు కురిపించింది. గట్టిగా కేకలు వేసింది.

 

దీంతో గమనించిన స్థానికులు వెంటనే అతడిని పట్టుకున్నారు. నిత్యం జనసంచారం ఉండే రహదారి అది. నాలుగు నెలల గర్భిణి అయిన ఓ ఐటీ ఉద్యోగిని సాహసం అందరినీ ఆశ్చర్యపరిచింది. అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని అతడి చొక్కాపట్టుకొని గట్టిగా నిలదీయడంతో దాడికి యత్నించాడు. ఆమెభయపడకుండా ఎదురు దాడి చేసింది.

అనంతరం గట్టిగా కేకలు వేయడంతో గమనించిన స్థానికులు వెంటనే అతడిని పట్టుకున్నారు. బాధితురాలి సమాచారంతో మాదాపూర్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు 100కు ఫోన్ చేయడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని సేషను తరలించారు. ఈ మేరకు బాధితు
రాలు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: