జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ను చూస్తే జాలివేస్తోందని వై ఎస్ ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమరనాద్‌  ఆయనేమి పెద్ద ఎక్స్‌ పర్ట్‌ కాదనిఅభిప్రాయపడ్డారు. రాజధాని ప్రాంతాల ప్రతిపాదనల గురించి మాట్లాడే ఎక్స్‌ పర్ట్‌ అయన అని నేను అనుకోవడంలేదన్నారు. ఆయన దేనిలో ఎక్స్‌ పర్ట్‌ అనేది ప్రజలకు తెలుసన్నారు.  చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ లు రాజకీయపార్టీలను నడిపే నైతిక హక్కులను కోల్పోయారని మండిపడ్డారు. భువనేశ్వరి వ్యాపారంలో భాగంగా అక్కడకు వచ్చినట్లు కనిపిస్తుందని ఆరోపించారు. హెరిటేజ్‌ కోసం భూములు కొన్నారు. అందుకే ఉద్యమంలో భాగస్వాములయ్యారు. వెన్నుపోటు సమయంలో బయటకు రాలేదు. విభజన సమయంలో బయటకు రాలేదు. అన్యాయాలు జరిగేటప్పుడు ఆమె రాలేదు. ఇప్పుడు ఇదంతా చూసి ప్రజలు ముక్కునవేలేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. 

ప్రస్టేషన్‌ లో చంద్రబాబు..
అధికారం  దూరమయ్యే సరికి చంద్రబాబు ప్రస్టేషన్‌ లో ఉన్నారు. సిఆర్‌ డిఏ ప్రాంతంలో ఆరునెలల క్రితం ఎన్నికలు జరిగాయి.ఆ పరిదిలోని 30 నియోజకవర్గాలలో పట్టుమని మూడు సీట్లు గెలవలేకపోయారు.సొంతకుమారుడు గెలవలేకపోయారు.మాండెట్‌ కోసం ప్రజలవద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు.అధికారతాపత్రయం కోసం తిరిగి ప్రజల వద్దకు వెళ్తే టిడిపికి ఉన్న మూడు సీట్లు పోతాయి. ఇప్పటికే రెండున్నర లక్షల అప్పులు ప్రభుత్వంపై నెట్టేసి ఉన్న స్దితిలో తిరిగి కొత్త  రాజధానిపై లక్షకోట్లు పెట్టుబడులు పెట్టి ఇబ్బందులు పడే ప్రయోగం మంచిది కాదని చెప్పారు.ప్రపంచంలోని అనేక దేశాలు ఇలాంటి ప్రయోగాలు చేసి ఏ విధంగా నష్టపోయాయో చెప్పారు.

ప్రజల వల్ల అభివృధ్ది..

రాజధాని అయినా ఏ నగరమైనా అది ప్రజల వల్ల అభివృధ్ది చెందాలి, నగరం అవ్వాలే తప్ప ప్రభుత్వమే నగరంగా అభివృద్ది చేయడమనేది ఫెయిల్యూర్‌ కాన్సెప్ట్‌.ఒక దగ్గర పరిపాలన, మరోచోట అభివృద్ది జరిగినప్పుడు ఏ రకమైన ఫలితాలు వచ్చాయో మన రాష్ట్రం ఉదాహరణగా దేశానికి కనపడుతోంది. తెలంగాణాలో జరిగిన ఉద్యమం. ఆరోజు వెనకబాటు నేపద్యంలో 1960–70లలో ఉద్యమం జరిగింది. కాని 2001 తర్వాత జరిగిన ఉద్యమం మనందరికి తెలుసు. ప్రపంచవ్యాప్తంగా ఆ విధంగా ఫెయిలైన 50 నగరాలను ప్రస్తావించారు. ఉదాహరణలు చెప్పారు. బోస్టన్‌ కమిటి రాష్ట్ర సమగ్ర అభివృధ్ది కి సంబంధించి కొన్ని అంశాలను బేస్‌ చేసుకుని ముఖ్యమంత్రి జగన్‌ కి నివేదిక సబ్‌ మిట్‌ చేసింది.దానిని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ స్వాగతించిందన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: