హైదరాబాదులో గత కొన్ని రోజుల నుండి బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ గేట్లు జిహెచ్ఎంసి అధికారులు మూసి వేయడం జరిగింది. 2019 నవంబర్ 23 వ తారీఖున మూసివేసిన ఈ గేట్లను తాజాగా జనవరి 4వ తేదీన తిరిగి ప్రారంభించారు. ఈ ఫ్లైఓవర్ పై కారు ప్రమాదం ఫ్లై ఓవర్ నుండి బస్సు కోసం వెయిట్ చేస్తున్న కింద పబ్లిక్ పై పడిన ఘటన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియో చూసి చాలామంది భయపడటం జరిగింది. దీంతో ఆ బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ఘటన జరిగిన నాటి నుండి నుండి జిహెచ్ఎంసి అధికారులు మూసివేశారు. అయితే తాజాగా ఇటీవల జనవరి 4వ తేదీ ఉదయం నగర మేయర్ బొంతు రామ్మోహన్ అదేవిధంగా సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఇద్దరూ కలిసి పరిశీలించి తిరిగి గేట్లు ఓపెన్ చేశారు.

 

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ...ఫ్లైఓవర్ పై జరిగిన ఘటన జరిగి ఇప్పటికి నలభై మూడు రోజులైంది దీంతో ఫ్లైఓవర్ మూసి వేయడం జరిగింది తిరిగి జనవరి 4వ తేదీ నుండి ఫ్లైఓవర్ పై రాకపోకలు పొలం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నిపుణుల కమిటీ సూచనల మేరకు అన్ని ఏర్పాట్లు చేశామని ...ఫ్లైఓవర్ పై 40 కిలోమీటర్ల స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్ వెళ్లకూడదని వెళితే స్పీడ్ లిమిట్ కంట్రోల్ కోసం చర్యలు తీసుకుంటామని మేయర్ వివరించారు.

 

అంతేకాకుండా కెమెరాలు మరియు స్పీడ్ వేగం నియంత్రిక లు ఏర్పాటు చేసినట్లు మేయర్ తెలిపారు. వాహనాల వేగం మరియు వాహనాలను నడిపే డ్రైవర్ల ప్రవర్తన నెలరోజులపాటు పరిశీలిస్తామని...రోజువారి నివేదికను నిపుణుల కమిటీకి పంపిస్తామని నివేదిక తర్వాత...మండల కమిటీ సూచనల మేరకు మరిన్ని జాగ్రత్తలు ఏర్పాట్లు తీసుకోబోతున్నట్లు అదేవిధంగా ఫ్లైఓవర్ పై సెల్ఫీలు దిగుతున్నారు..సెల్ఫీలు కూడా దిగకుండా సైడ్ వాల్స్ ఏర్పాటు చేయబోతున్నట్లు ఈసారి ఎవరైనా సెల్ఫీ అడిగితే మాత్రం జరిమాన గట్టిగా విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: