కొందరు ఆంధ్రా జాలర్లు చేపల వేటకు వెళ్లి పాకిస్తాన్‌ జల భాగంలోకి వెళ్లి అక్కడి కోస్ట్‌గార్డులకు చిక్కారు. ఏళ్ల తరబడి అక్కడి జైళ్లలో మగ్గుతున్నారు. వారిలో 15 మంది శ్రీకాకుళం జిల్లా, 5గురు విజయనగరం, ఇద్దరు తూర్పుగోదావరి జిల్లా వాసులు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్న సమయంలో బాధిత కుటుంబ సభ్యులు సమస్యను వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు. జగన్ వారిని ఆదుకుంటానని హామీ ఇచ్చారు.

 

సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత మత్స్యకారులను విడిపించేందుకు అనేక విధాలుగా ప్రయత్నాలు చేశారు. ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి ప్రధాని, అమిత్‌షా నోటీస్‌కు తీసుకువెళ్లారు. ఎంపీ విజయసాయిరెడ్డి ద్వారా ప్రయత్నాలు చేపించారు. అమిత్‌షాకు 31–08–19న సీఎం వైయస్‌ జగన్‌ లేఖ రాశారు.ఆ తరువాత పాకిస్తాన్‌ ప్రభుత్వం డిసెంబర్‌ 31న మత్స్యకారులను రిలీజ్‌ చేయడానికి అంగీకరిస్తూ విదేశాంగ శాఖకు సమాచారం పంపించింది.

 

మొత్తానికి సీఎం చొరవతో ఈ నెల 6వ తేదీన సాయంత్రం 4 గంటలకు 20 మంది మత్స్యకారులు వాఘా సరిహద్దు ద్వారా భారతదేశంలోకి చేరుకుంటారని మంత్రి మోపిదేవి తెలిపారు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు మరో నెల రోజుల్లో వస్తారని, 20 మందికి వైద్య పరీక్షలు చేసిన తరువాత వారి గ్రామాలకు పంపించడం జరుగుతుందన్నారు.

పాకిస్తాన్‌ జైల్లో ఉన్న మత్స్యకారులను విడిపించేందుకు ప్రయత్నం చేస్తూనే.. జైల్లో ఉన్న 22 మంది మత్స్యకారుల కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం వైయస్‌ జగన్‌ ప్రతి నెలా ఒక్కో కుటుంబానికి రూ.4500 ఆర్థిక సాయం చేస్తున్నారన్నారు.

 

ఇదే కాకుండా ప్రభుత్వ పరంగా లోన్‌లు ఇప్పించి అండగా నిలిచారన్నారు. సీఎం చొరవతో మత్స్యకారులు విడుదల అవుతున్నారన్నారు. దీంతో ఆ కుటుంబాలు, ఆ ప్రాంత ప్రజలు సీఎంకు ధన్యవాదాలు తెలుపుతున్నారన్నారు. తమ వల్లే రిలీజ్‌ అవుతున్నట్లుగా అక్కడి ప్రాంత టీడీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని, దీన్ని కూడా రాజకీయం చేయడం తగదన్నారు మంత్రి మోపిదేవి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: