అమరావతి నుంచి రాజధాని మార్చాలని జగన్ ప్రభుత్వం డిసైడైంది. దీనిపై గగ్గోలు పెడుతున్న చంద్రబాబు రెండు మాటలు బాగా వాడుతున్నారు. అది అధికార వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ. రాష్ట్రం ఏర్పడి సుమారు 63 సంవత్సరాలు అయ్యింది. అన్నాళ్లు హైదరాబాదే మనకు రాజధానిగా ఉండేది. అధికారాన్ని ఒకే చోట కేంద్రీకరించి, అభివృద్ధిని వికేంద్రీకరిద్దామని చెప్పాం. మరి ఇది సాధ్యమైందా? వలసలు ఎవరైనా ఆపగలిగారా?

ఈ ప్రశ్నకు టీడీపీ సమాధానం చెప్పగలదా..?

 

రాయలసీమలో బీడు భూములను పంట భూములుగా మార్చే ప్రయత్నాలు ఎంతవరకు సఫలికృతమయ్యాయి. రాష్ట్రంలో ఎంతో వ్యత్యాసం ఉంది. ఈ మాటలు చెప్పుకోవడానికి బాగున్నాయే తప్ప ఆచరణలో సాధ్యం కాలేదు. గత ఐదేళ్లలో అభివృద్ధిని బ్రహ్మండంగా వికేంద్రీకరించామని చంద్రబాబు చెబుతుున్నారు. 2018లో ప్రభుత్వం విడుదల చేసిన ప్రగతి నివేదికలో చిట్టచివరి స్థానానికి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు పోటీపడుతున్నాయి. జీడీపీలో 3 శాతం మాత్రమే ఉంది.

 

ఇప్పుడు జగన్.. అధికార కేంద్రాలను సైతం వికేంద్రీకరిస్తే తప్ప అభివృద్ధి వికేంద్రీకరణ జరగదని అంటున్నారు. మొన్ననే రేషన్‌కు సంబంధించి పోర్టబులిటీపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు కేంద్రం కూడా ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఎవరైనా వలస వెళ్లిన కుటుంబాలు ఇతర ప్రాంతాల్లో నివాసం చేస్తుంటే అక్కడే రేషన్‌ తీసుకోవచ్చు.

 

రాష్ట్రంలో ప్రగతి వ్యత్యాసాలు ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పేందుకు మరో ఉదాహరణ ఉంది. గుంటూరు, ఈస్ట్‌, వెస్ట్‌ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారు రేషన్‌ తీసుకుంటున్న వారు ఒక్కో జిల్లాలో 3 నుంచి 4 లక్షల మంది ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాను పరిశీలిస్తే..ఇతర జిల్లాల నుంచి వచ్చి రేషన్‌ తీసుకునేవారు 7 వేల మంది ఉన్నారు. విజయనగరంలో 60 వేల మంది ఉన్నారు.

 

ఇతర జిల్లాల్లో రేషన్‌ తీసుకుంటున్న వారందరూ ఎవరూ? ..వారంతా కూడా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల వారే. కుటుంబాలను విడిచిపెట్టి, బతుకులను విడిచిపెట్టి ఇతర రాష్ట్రాలకు, దేశాలకు వలస వెళ్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల తరువాత రాయలసీమ జిల్లాలు ఉన్నాయి. అందుకే అధికార వికేంద్రీకరణ ద్వారానే ఈ రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ చేయగలమని జగన్ నమ్ముతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: