వైసీపీ ప్రభుత్వం 4 ఎస్సీ నియోజకవర్గాల మద్య ఉన్న అమరావతిని తరలించే కుట్రను కప్పిపుచ్చుకునేందుకు దళిత అధికారి ప్రతిష్టతను వాడుకునే స్ధితికి దిగజారింది. చంద్రబాబు దళిత అధికారిని కులం పేరుతో దూషించలేదని నిరూపిస్తే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాజీనామా చేస్తారా?  అని వర్ల రామయ్య ప్రశ్నించారు.  చంద్రబాబు దళిత అధికారిని గారు అని సంభోదిస్తే..దాన్ని వైసీపీ వక్రీకరించి అనని మాటలు అన్నట్లు అసత్య ప్రచారం చేస్తోంది. గతంలో అసెంబ్లీ గేటు వద్ద చంద్రబాబుని అడ్డగించిన అధికారిపై నోక్వశ్చన్‌ అన్న మాటను బాస్టడ్‌ అన్నట్లుగా వక్రీకరించి అభాసుపాలయ్యారు. 


ఇప్పుడు మళ్లీ బీసీజీ కమిటీ అసత్యాలను కప్పిపుచ్చుకునేందుకు, అమరావతిలో దళితులకు చేస్తున్న ద్రోహాన్ని కప్పిపుచ్చుకునేందుకు మరోసారి వక్రీకరణలకు, అసత్య ప్రచారాలకు వైసీపీ నేతలు దిగజారారు. వాస్తవంగా దళితులకు ద్రోహం చేస్తోంది వైసీపీనే. గుంటూరు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 120 దళిత కుటుంబాలను వైసీపీ నాయకులు గ్రామం నుంచి వెలివేస్తే వారికోసం చంద్రబాబు పోరాడి పోలీసు నిర్భందాన్ని ఎదురించి ఆత్మకూరు దళితులకు న్యాయం చేసింది చంద్రబాబు కాదా? చంద్రబాబు ఏడాదికి రూ. 2,500 కోట్లు నిధులు ఎస్సీ కార్పోరేషన్‌కి కేటాయిస్తే వాటిలో సగానికి సగం కోత విధించి దళితులకు ద్రోహం చేసింది జగన్‌ కాదా? చంద్రబాబు డప్పు కళాకారులకు పెన్సన్‌ ఇస్తే దాన్ని ఎగొట్టి దళితుల పొట్ట కొట్టింది జగన్‌ కాదా?  దళితుడైన కాకిమాధవరావుని చంద్రబాబు సీఎస్‌గా నియమించారు. 


పున్నయ్య కమిషన్‌ వేసి 42 సిపారసులు యధాతదంగా చంద్రబాబు అమలు చేశారు.  దళిత నాయకుడైన మందకృష్ట మాదిగకు సీఎం అపాయింట్‌మెంట్‌ ఇవ్వకుండా దళితుల ఆత్మగౌరవాన్ని జగన్‌ దెబ్బతీశారు.  కచ్చలూరు బోటు ప్రమాదంలో 70 మందికిపైగా అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణమైన ప్రభుత్వ వైపల్యాలను ప్రశ్నించినందుకు మాజీ ఎంపీ హర్షకుమార్‌ని తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్‌ చేసి జైల్లో పెట్టారు. అంబేద్కర్‌ ఎవరో తెలియని ఆమెకు దళిత నియోజకవర్గంలో టికెట్‌ ఇచ్చిన  దళిత ఉద్దారకుడు జగన్‌.  


జీవో ఆర్టీ నెం. 14 రూ.1270 కోట్ల దళిత నిధుల్ని జగన్‌ ప్రభుత్వం దారి మల్లించి దళితుకులకు ద్రోహం చేస్తోంది. ఎస్సీ కార్పోరేషన్‌ ద్వారా  7 నెలల వైసీపీ పాలనలో ఒక్క ఎస్సీకైనా రుణాలు ఇచ్చారా?  జగన్‌ కొద్ది  మంది వ్యక్తులకు మాత్రమే లబ్ది చేకూరుస్తూ దళిత సామాజికవర్గానికి ద్రోహం చేస్తున్నారు. దీన్ని కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ చంద్రబాబుపై పదేపదే అసత్య ఆరోపణలు చేస్తోంది. దీన్ని దళిత నాయకులు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు ఖండించాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: