ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమి తరువాత  ఆ పార్టీని కమ్మ సామాజిక వర్గ నేతలు ఒక్కొక్కరుగా వీడుతున్నారు . ఏ సామాజికవర్గానికైతే పార్టీ నాయకత్వం దన్నుగా నిలుస్తుందని భావించి  , మిగతా సామాజిక వర్గాల నేతలు ఎక్కడ పార్టీ వీడుతారోనని ఆందోళన చెందుతోన్న  తరుణం లో సొంత సామాజికవర్గ నేతలే పార్టీని వీడుతుండడం అధినేత చంద్రబాబు నాయుడు కు శరాఘాతంగా  మారింది .

 

టీడీపీ ఓటమి అనంతరం పార్టీలో తమకు ప్రాధాన్యత లభించడం లేదని ఒక సామాజికవర్గం నేతలు సమావేశమై , భవిష్యత్తు కార్యచరణపై చర్చించిన విషయం తెల్సిందే . అయితే సమావేశంలో పాల్గొన్న చాలామంది నేతలు , కష్టకాలంలో పార్టీని వీడడం సరికాదని నిర్ణయించుకుని , పార్టీ లో యధావిధిగా కొనసాగుతున్నారు . అయితే అందులోను ఒకరిద్దరు నేతలు తమ రాజకీయ భవిష్యత్తును వెత్తుకుంటూ వైస్సార్ కాంగ్రెస్ పార్టీ , బీజేపీ లో చేరారు .. అదివేరే విషయం అనుకోండి . ఇక పార్టీ అధికారం లో ఉన్నన్ని రోజులు పార్టీ అధినేత చుట్టూ చేరినవాళ్లు , అధికారాన్ని అనుభవించినవాళ్లు ...  అధికారం చేజారగానే తమ దారి తాము చూసుకుంటున్నారు .

 

 ఇప్పుడు అదే సామాజికవర్గానికి చెందిన నేతలు ఒకరితరువాత మరొకరు టీడీపీని విడుతూ, పార్టీ  నాయకత్వానికి షాక్ ఇస్తున్నారు . మొన్న వల్లభనేని వంశీమోహన్ టీడీపీ కి గుడ్ బై చెబితే , నిన్న దేవినేని అవినాష్ పార్టీ యువత అధ్యక్ష పదవి త్యజించి వైస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరిపోయారు . ఇక తాజాగా  పార్టీలో అంచలంచెలుగా ఎదిగిన నాదెండ్ల బ్రహ్మం చౌదరి కూడా విద్యార్థి విభాగం అధ్యక్ష పదవి వద్దనుకుని పార్టీకైతే రాజీనామా చేశారు .. కానీ ఏ పార్టీ లో చేరుతారనేది ఇంకా  ప్రకటించలేదు . 

మరింత సమాచారం తెలుసుకోండి: