ఆదివారం రాత్రి కృష్ణాజిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో గ్రామసచివాలం పై ఉన్నటువంటి వైఎస్ఆర్ ఫ్లెక్సీల పైన అంటే.. సీఎం జగన్ ముఖముపై నల్ల రంగు పూశారు కొంతమంది దుండగులు. ఇదే తరహాలో గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ బ్యానర్ ఫోటోలపై బురద చల్లారు. అయితే, ఇటువంటి సంఘటనలు పై వైసీపీ పార్టీ వాళ్లు బాగా సీరియస్ అయ్యారు. అలాగే, ఈ ఆగంతుకులపై గన్నవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. సీసీ కెమెరాలను


ఆగంతకులు ఇటువంటి చర్యలను రిపీట్ చేయకుండా ఆందోళనలను చేపట్టారు వైసీపీ కార్యకర్తలు. అలాగే ఈ చర్యను చేసే దుండగులను పట్టుకోవడానికి సీసీ టీవీ లను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు ఆ గ్రామపంచాయతీ కార్యకర్తలు. కేసరపల్లి లోని మరికొన్ని చోట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మొహం పై గీతలు గీశారని వైసిపి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఇకపోతే, ఏపీ మత్స్యకారులు నేడు స్వదేశానికి రానున్నారు. గుజరాత్ తీర ప్రాంతం నుంచి చేపల వేటకు వెళ్లిన ఉత్తరాంధ్ర మత్స్యకారులు దారి తప్పి పాకిస్తాన్ సముద్ర జలాల్లోకి ప్రవేశించారు. దాంతో, 2018 నవంబర్ నెలలో పాకిస్తాన్ సైన్యం దారి తప్పి పోయిన 20 మంది మత్స్యకారులను అరెస్ట్ చేశారు. అయితే, అలా అరెస్ట్ అయిన ఈ మత్స్యకారులు గత 13నెలలుగా పాకిస్థాన్లోని కరాచీ కారాగారంలో ఉన్నారు. వీరిని విడుదల చేయమని భారత్ కోరుకొనగా వారిని ఆదివారం రోజు విడుదల చేసి వాఘా సరిహద్దు వద్ద సోమవారం మన దేశానికి అప్పగించనున్నారు. అయితే, పాదయాత్రలో ఉన్నపుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి పాక్ చెరలో ఉన్నటువంటి మత్స్యకారులు విడిపిస్తానని బాధిత కుటుంబాలకి హామీ ఇచ్చారు. మాట ఇచ్చినట్లే, విజయ్ సాయి రెడ్డి ద్వారా విదేశాంగ శాఖ పై ఒత్తిడి తెప్పించి మత్స్యకారులను విడిపించారు జగన్ మోహన్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: