ప్రజా రాజధాని అమరావతిని తరలించొద్దంటూ అక్కడి మహిళలు, రైతులు, 20 రోజులుగా ఆందోళనలు చేస్తుంటే.. వారిని అవమానించేలా వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ నేత తంగిరాల  సౌమ్య పేర్కొన్నారు.  రాజధాని కోసం 33వేల ఎకరాలను త్యాగం చేసిన రైతులను.. ఒక ప్రజాప్రతినిధి అయిఉండి హేళనగా మాట్లాడటం రోజాకే చెల్లింది. 5 కోట్ల ప్రజల మనోవేదన పట్ల ఆమె స్పందించే తీరు ఇదేనా? రాజధాని కోసం భూములు ఇవ్వడమే రైతులు చేసిన నేరమా? నారా భువనేశ్వరి గారి గురించి మాట్లాడే స్థాయి రోజాకు లేదు. 

 

నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. భువనేశ్వరి గారి కాలిగోటికి కూడా రోజా సరిపోరు. కెమెరా ముందు రంకెలు వేసే రోజా.. అవే మాటలు అమరావతికి వచ్చి మాట్లాడితే.. ప్రజలు చెప్పులతో తరిమి తరిమి కొడతారు.  లక్ష కోట్ల అక్రమాస్తుల కేసులో జగన్మోహన్‌ రెడ్డి 16 నెలలు జైల్లో ఉంటే.. కొడుకును విడిపించాలని చెంచల్‌ గూడ జైలు వద్ద తల్లి వైఎస్‌ విజయ, భార్య భారతి, చెల్లి షర్మిల మాదిరిగా నారా భువనేశ్వరి గారు ఏనాడూ రోడ్డు ఎక్కలేదు. 5 కోట్ల ఆంధ్రుల రాజధాని అమరావతిని కాపాడుకోవడం కోసం ఈ ప్రాంత ఆడపడుచుగా నారా భువనేశ్వరి గారు ఉద్యమానికి అండగా నిలబడ్డారు. తన వంతు సాయంగా చేతి గాజులను విరాళంగా ఇచ్చారు. దీంతో తమ పునాదులు కదిలిపోవడంతో.. సహించలేకే వైసీపీ నేతలు అవాకులు చవాకులు పేలుతున్నారు.

 

అమరావతికి పూర్తి మద్దతు తెలుపుతూ ఆనాడు ప్రతిపక్ష నేత హోదాలో జగన్‌ మాట్లాడిన మాటలు రోజాకు వినపడలేదా? నేడు యూటర్న్‌ తీసుకుని చంద్రబాబునాయుడు గారిపై కక్షతో రాజధానిని చంపేందుకు కుట్రలు చేస్తుంటే.. చూస్తూ ఊరుకోవాలా? అధికారం చేపట్టిన 6 నెలలకే రాష్ట్రాన్ని నిండా ముంచిన జగన్మోహన్‌ రెడ్డిని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు. వైసీపీకి ఎందుకు ఓట్లేశామా అని బాధపడుతున్నారు. తిరిగి ఎన్నికలకు వెళ్లే ధైర్యం వైసీపీకి ఉందా? ఎన్నికల్లో గెలిచిన తర్వాత నియోజకవర్గాన్ని తిరిగి చూడలేదని నగరి ప్రజలు తరిమికొట్టినా రోజాకు సిగ్గురాలేదు. మహిళా సమాజానికే చీడపురుగులా దాపురించిన రోజాకు ఎమ్మెల్యేగా కొనసాగే నైతిక హక్కు లేదు. ఇప్పటికైనా రోజా తన నోటిని అదుపులో పెట్టుకోకపోతే.. రాజధాని రైతులే ఆమెకు సమాధి కడతారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: