ఫోటోగ్రఫీకే వన్నె తెచ్చిన కీర్తిశేషులు అహోబలరావు స్మృత్యర్థం ఏర్పాటు చేసే కార్యక్రమానికైనా ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని సి. రాఘవాచారి ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథరెడ్డి హామీ ఇచ్చారు. ఏపీయూడబ్ల్యూజే కృష్ణా అర్బన్ అధ్యక్షుడు చావా రవి అధ్యక్షతన ప్రెస్ క్లబ్‌లో జరిగిన అహోబలరావు సంస్మరణ సభకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన‌ మాట్లాడుతూ ఫోటో గ్రాఫర్ గా సుదీర్ఘకాలం పాటు ఆయన అందించిన సేవలు వృత్తి పట్ల నిబద్ధతకు నిదర్శమన్నారు. ఐజేయూ జాతీయ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు మాట్లాడుతూ ఫోటోగ్రఫీ అంటే అహోబలరావు.. అహోబలరావు అంటే ఫోటోగ్రఫీ అనే విధంగా సుదీర్ఘ కాలంపాటు సేవలందించారన్నారు.

ఎలాంటి టెక్నాలజీ లేని సమయంలో దేశంలోని అగ్రనేతల ఫోటోలను తీసిన ఏకైక వ్యక్తి అహోబలరావు అని తెలిపారు. ఆయన ఫోటోగ్రఫీని వ్యాపార దృక్పథంతో కాకుండా అంకిత భావంతో నిర్వహించి అనేక మందికి ఫోటోగ్రఫీలో శిక్షణ ఇచ్చి ఉపాధిని కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందని కొనియాడారు. ఆయన ఓ మంచి ఫోటోగ్రాఫర్ ఉన్న సమయంలో పత్రికలు సైతం ఫోటోగ్రాఫర్లను నియమించుకునే పరిస్థితులు లేని పరిస్థితులలో ప్రతి పత్రికకు వేర్వేరు ఫోటోలను పంపించి ఎక్కడా ఫోటో రిపీట్ కాకుండా ఎంతో జాగ్రత్త తీసుకునే వారన్నారు.

ఆంధ్రప్రదేశ్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ సాంబశివరావు, ఉపాధ్యక్షులు రమణ, ఏపీయూడబ్ల్యూజే కృష్ణా అర్బన్ కార్యదర్శి కొండా రాజేశ్వరరావు, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నిమ్మరాజు చలపతిరావు, రాష్ట్ర కౌన్సిల్ షేక్ బాబు, చిన్న పత్రికల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ రమణారెడ్డి, ఫోటో గ్రాఫర్స్ అసోసియేషన్ నాయకులు మాదాల రమేష్, లహరి శంకర్, అప్పారావు, శ్రీనివాసరావు, భద్రం, గోపీచంద్, ప్రసాద్ తదితరులు ప్రసంగించారు. తొలుత అహోబలరావు చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. మృతికి సంతాప సూచకంగా రెండు నిముషాలు మౌనం పాటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: