మనిషి రక్తానికి  రుచి మరిగిన పులి ఏకంగా నెల రోజుల వ్యవధిలో ఆరుగురు మనుషుల్ని పొట్టన పెట్టుకుంది. ప్రతిరోజు గ్రామంపై దాడి చేసి మనుషులను చంపి తింటుంది ఆ చిరుత పులి. నవంబర్ 27నుంచి నిన్న సోమవారం వరకు ఆరుగురు వ్యక్తులను  చంపడంతో గ్రామస్తులు ఆగ్రహానికి గురయ్యారు. పులి చంపేస్తుంది అన్న భయం ఉన్నప్పటికీ మరో ప్రాణం పోకూడదని ధైర్యం తెచ్చుకుని పులిని జనం  మొత్తం వెంటాడి కాల్చి చంపారు. స్థానికంగా ఈ  ఘటన కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్ జిల్లా భోగాపుర్  గ్రామంలో జరిగింది ఈ ఘటన. వివరాల్లోకి వెళితే... భోగం పూర్ గ్రామానికి చెందిన ప్రశాంత్ అనే బాలుడు అక్కడి ప్రభుత్వ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నాడు. భోజనం నిమిత్తం ఆ బాలుడు మధ్యాహ్న సమయంలో ఇంటికి బయలుదేరాడు. ఆ బాలుడు ఇంటికి వెళ్తున్న సమయంలో మార్గమధ్యంలో చెరుకు తోట లో నుంచి చిరుత ఆ బాలుడికి  ఎదురుపడింది. 

 

 

 అయితే హఠాత్తుగా పులి ఎదురుపడడంతో భయం తో ఊగిపోయిన బాలుడు తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. . కానీ ఆ చిరుత పులి వేగం ముందు బాలుడు తప్పించుకోలేక పోయాడు.  అమాంతం బాలుడిపై దూకి  చెరుకు తోట లోకి తీసుకెళ్ళి దాడి చేసింది చిరుత పులి. అదే మార్గంలో వస్తున్న కపిల్ కుమార్ అనే వ్యక్తి ఆ బాలుడిని రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఇక బాలుడు మరణించిన సంగతి కపిల్ కుమార్ గ్రామస్తులకు తెలియజేయడంతో.. గ్రామస్తులందరూ ఆగ్రహంతో  వందలాది తుపాకులు పట్టుకుని చెరుకు తోట కి వెళ్లారు. అయితే అప్పటికే బాలుని చంపి తిన్న ఆ పులిని అక్కడికక్కడే కాల్చిచంపారు గ్రామస్తులు. బాలుడి మృతదేహంతో పాటు చిరుత పులి కళేబరాన్ని  గ్రామానికి తీసుకెళ్లారు. 

 

 

 అయితే ఈ ఘటన గురించి తెలుసుకున్న నజిబాబాద్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శుక్ల... చిరుత దాడిలో మృతి చెందిన బాలడి  కుటుంబానికి 5 లక్షల పరిహారం ఇస్తామని తెలియజేశారు. అయితే అటవీ అధికారుల ఫిర్యాదు పై కేసు రిజిస్టర్ చేస్తాము అని  జిల్లా ఎస్పీ లక్ష్మీనివాస్ మిష్రా  చెప్పారు. కాగా ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆ గ్రామస్తులకు చిరుతపులి నుంచి ప్రాణ భయం తప్పింది . దీంతో గ్రామస్తులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: