పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి.  అమెరికా డ్రోన్ దాడిలో ఇరాన్ ఆర్మీ కమాండర్ సులేమాని మరణించిన తరువాత ఇరాన్ లో కలకలం మొదలైంది.  అమెరికాపై ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతి ఇరాన్ పౌరుడు అభిప్రాయ పడుతున్నారు.  ఇందులో భాగంగానే ఇరాన్ డజనుకు పైగా క్షిపణులను అమెరికా ఎయిర్ బేస్ మీదకు ప్రయోగించింది.

 
ఈ దాడిలో దాదాపుగా 80 మంది అమెరికన్ ఉగ్రవాదులు మరణించినట్టుగా ఇరాన్ పేర్కొన్నది. అంతే మొత్తంలో ఆయుధాలు కూడా అగ్నికి ఆహుతయ్యాయని అంటున్నారు. అయితే, ఈ దాడిలో ఎంతమంది మరణించారు అనే విషయాన్ని అమెరికా బయటపెట్టలేదు.  అయితే, అమెరికా దీనిపై సైలెంట్ గా ఉండటంతో ఏదైనా ప్లాన్ వేస్తుందేమో అనే డౌట్ క్రియేట్ అవుతున్నది.  

 

అమెరికా దాడి చేస్తే దానిని ఎదుర్కోవదానికి ఇరాన్ సైతం సిద్ధంగా ఉన్నది.  ఈ ఉద్రిక్తతల నడుమ ఇప్పుడు ప్రత్యక్షంగా యుద్ధం సంభవిస్తే ప్రపంచం భవిష్యత్తు ఏంటి అన్నది అర్ధం కావడం లేదు.  ఈ యుద్ధం అక్కడితో ఆగుతుందా అంటే లేదని అంటున్నారు.  ఎందుకంటే అమెరికన్ ఎయిర్ బేస్ లో ఒక్క అమెరికా సైన్యం మాత్రమే కాకుండా సంకీర్ణ బలగాలు ఉన్నాయని తెలుస్తోంది.  


ఈ బలగాలు భారీ ఎత్తున దాడులు చేస్తే... ఇరాన్ ఏం చేయబోతుంది అన్నది తెలియాల్సి ఉన్నది.  అయితే, ఇరాన్ కూడా అమెరికా దాడి చేస్తే దానిని తిప్పికొట్టేందుకు యుద్ధంగా ఉన్నది.  ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారు అన్నది విషయం కాదు.  యుద్ధం వస్తే ప్రపంచం భవిష్యత్తు ఏంటి అన్నది తెలియడం లేదు.  ఇరాన్ దాడులు చేసిన వెంటనే ఇండియాలో మార్కెట్ కుదేలైంది.  ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.  బంగారం ధరలు పతనం అయ్యాయి.  పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ దాడుల విషయంలో అమెరికా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అన్నది తెలియాల్సి ఉన్నది. 

మరింత సమాచారం తెలుసుకోండి: