ఐక్య పోరాటాలతో మోదీ సర్కారు మెడ వంచుతామంటూ ఎర్ర సైన్యం కన్నెర్ర చేసింది. తమ హక్కులను పరిరక్షించుకునే క్రమంలో బుధవారం చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మిక లోకం గర్జించింది. బహుళజాతి కంపెనీల, పెట్టుబడిదారుల కొమ్ముకాస్తూ, కార్మికుల పొట్టగొట్టే విధానాలు అవలంబిస్తున్న మోదీ సర్కారు మెడ వంచి భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటామని కార్మిక సంఘాలు ప్రతిజ్ఞ బునాయి. జాతీయ సార్వత్రిక సమ్మెలో భాగంగా బుధవారం నాడు ఇందిరా పార్కు వద్ద ఏఐటి  యుసి,  ఐఎన్  టియుసి, సిఐటియుసి, ఐఎఫ్ టియు, ఐజెయు, టి యుడబ్ల్యుజె, టి యుడబ్ల్యుజె, టియుడబ్ల్యుజె, టిఎన్ టియుసి, ఏఐయుటియుసి, ఏఐడిఈఎఫ్, సిసిఈజిడబ్ల్యు, ఆటో వర్కర్స్ , క్యాబ్ జాక్ తదితర సంఘాల నేతృత్వంలో వేలాది మంది కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో కార్మిక సంఘాల నేతలు ప్రసంగిస్తూ, కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై మండిపడ్డారు.

అప్రకటిత యుద్ధం..

కార్మికుల, కర్షకుల ఓట్లతో అధికారం చేజిక్కించుకున్న మోదీ ప్రభుత్వం... కార్మికులపై, కర్షకులపై, మైనారిటీలపై అప్రకటిత యుద్ధం చేస్తుందని వారు ధ్వజమెత్తారు. సర్కారు అప్రజాస్వామిక చర్యలను నిరసిస్తూ కోట్లాది కార్మిక లోకం పోరాడుతున్నట్లు వారు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కార్మిక సంఘాలను నిర్వీర్యం చేసి, కార్మికుల పక్షానా గొంతు లేకుండా ఉండేందుకు కుట్రలు చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం వెంటనే అలాంటి ఆలోచనలను విరమించుకోవాలని, లేనిపక్షంలో తగినరీతిలో గుణపాఠం తప్పదని కార్మిక సంఘాల నేతలు హెచ్చరించారు. ఈ సభలో ఆదిల్ షరీఫ్, విజయ్ కుమార్ యాదవ్(ఐఎన్ టియుసి), యం.నర్సింహా, వి.ఎస్.బోస్(ఏఐటియుసి), కె.ఈశ్వర్ రావు, ఎం.సాయిబాబా(సిఐటియు ), కె.శ్రీనివాస్ రెడ్డి, వై.నరేందర్ రెడ్డి, కె.సత్యనారాయణ(ఐజెయు), కె.విరాహత్ అలీ, విష్ణుదాస్ శ్రీకాంత్, ఏ.రాజేష్(టియుడబ్ల్యుజె) శిగ శంకర్ గౌడ్(హెచ్ యుజె) ఎస్.ఎల్.పద్మ, కె.సూర్యం, అనురాధ, ముఖ్తర్ పాషా(ఐఎఫ్ టియు), ఎ.బాబురావు, భారత్ కుమార్(ఏఐయుటి  యుసి), రత్నాకర్ రావు, ఎం.కె.బోస్(ఐఎన్  టియుసి) తదితరులు ప్రసంగించారు.


 దేశవ్యాప్త సమ్మెలో భాగంగా గుంటూరు జిల్లా క్రోసూరులో జరిగిన బంద్ కార్యక్రమంలో పాల్గొన్న సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక సంస్థ సభ్యులు, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ఉదయం విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టాండు వద్ద జరిగిన సార్వత్రిక సమ్మెలో భాగంగా వివిధ మీడియాలతో మాట్లాడుతున్న సిపిఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ చిత్రంలో సిపిఐ సిపిఎం మరియు యు.వి ఇతర సంఘాల నేతలు పాల్గొన్నారు.  సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ, సిపిఐ సీనియర్ నాయకులు పోట్రూ వెంకటేశ్వరరావు, 42 వ డివిజన్ శాఖ కార్యదర్శి మరియు నగర కార్యదర్శివర్గ సభ్యులు నక్క వీరభద్ర రావు తదితరులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: