ఓ వార్త సంచలనం కావాలంటే అందులో ఎంతో విషయం ఉంటేనే కానీ జనాల్లోకి వెళ్లదు. సంభ్రమాశ్చర్యాల్లాంటి సంఘటనలు జరిగినప్పుడే ఔరా.. అమ్మో.. బాబోయ్.. అలానా.. అలా జరిగిందా.. అంటాం. సాధారణంగా వయసులో ఉన్నవారు.. కాస్త పెద్దవారు చేసే భీతి గొలిపే విన్యాసాలను చూస్తేనే మనకు భయం వేస్తుంది. అలాంటిది ఓ చిన్నపిల్ల భయం గొలిపే పని తనకు తెలీకుండానే చేస్తే అది చూసిన మనకు మరెంత గుండె కొట్టుకుంటుందో ఊహించండి. అలాంటి ఒళ్లు గగుర్పొడిచే సంఘటనే ఇటివల జరిగింది.

 

 

ఆరేళ్ల చిన్న పాప ఓ అపార్ట్ మెంట్ పిట్టగోడ మీద ఎటువంటి ఆధారం లేకుండా నడిస్తే.. అదీ నాలుగో అంతస్తు మీద ఇటువంటి ఘటన జరిగితే.. ఎలా ఉంటుందో ఊహించండి. చదవటానికే అమ్మో.. అనిపించే ఈ సంఘటన.. ఇక వీడియోలో చూస్తే గుండె గుభేల్ మనడం ఖాయం. ఓ చిన్నారి తాను నివసించే అపార్ట్ మెంట్ లోని నాలుగో అంతస్థులో ఇలా నడిచింది. తమ ఫ్లాట్ లోని కిటికీకి ఆనుకుని ఉండే సన్నని గోడ మీద నడుచుకుంటూ వెళ్లింది. మళ్లీ అదే గోడ మీద నుంచి కిటికీ వద్దకు మళ్లీ నడుచుకుంటూ వచ్చింది. ముందు నడుచుకుంటూ వచ్చి బాల్కనీలోకి ఎక్కాలని ప్రయత్నించి విఫలమై మళ్లీ వచ్చినదారినే నడుచుకుంటూ వెళ్లింది. చూస్తున్నంత సేపూ మన గుండెలదరిపోయే ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియరాలేదు.

 

 

ఇటువంటి సంఘటనలను చూసినప్పుడు.. చిన్నారులను ఓ కంట కనిపెట్టుకుని ఉండాలనేది ఇందుకేనేమో అనే అనుమానం రాకమానదు. అదే నాలుగంతస్థుల నుంచి కిందకి చూస్తేనే మనకు కళ్లు తిరిగినంత పనవుతుంది. కానీ.. చిన్నారికి ఇవేమీ తెలీకపోవడంతో చాలా కామన్ గా ఆ సన్నని గోడ అంచున నడుచుకుంటూ వెళ్లిపోయింది. తెలీక ఆ పాప చేసిన ఈ పనిని కింది వీడియోలో చూడవచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: