జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీ, హై పవర్ కమిటీ కూడా అధికార వికేంద్రీకరణకే మొగ్గు చూపిన విషయం తెలిసిందే. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖను అధికారికంగా ప్రకటించకున్నా ఆ మేరకు ఇప్పటికే వేగంగా అడుగులు పడుతున్నాయి. మిలీనియం బ్లాక్ టవర్ లో సచివాలయం, సీఎం క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే రాజధానిలో పరిపాలనావ్యవస్థపై ఫోకస్ పెట్టింది. 
 
ఏపీ ప్రభుత్వం నుండి విశాఖ అభివృద్ధి కొరకు రోజుకో ప్రతిపాదన వెలువడుతోంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని మెట్రో రైలు ప్రతిపాదనకు ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. రామకృష్ణ బీచ్ మీద ట్రామ్ రైలును పరుగులు పెట్టించటానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సీఎం జగన్ ట్రామ్ డీపీఆర్ ను తయారు చేసేందుకు కన్సల్టెంట్లను నియమించాలని ఆదేశాలు జారీ చేశారు. 
 
రెండు దశల్లో ట్రామ్ నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఆర్కే బీచ్ నుండి బీమునిపట్నం వరకు ట్రామ్ నిర్మాణం జరగబోతుందని సమాచారం. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖ నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ప్రభుత్వం అవసరాలు తీరేలా అభివృద్ధి జరిగేలా ఖర్చు తక్కువగా ఉండేలా అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన చేస్తోంది. సీఎం జగన్ ట్రామ్ రైలు ప్రతిపాదన చేయటంతో ఆ రైలు ఎలా ఉంటుందనే ఆసక్తి ఇప్పుడు అందరిలో కనిపిస్తోంది. 
 
ఈ రైలు మూడు కంపార్ట్మెంట్లతో ఉంటుంది. ఈ రైలు ప్రయాణించడానికి పట్టాలు అవసరం లేదు. ఇప్పటికే దీని గురించి ట్రాఫిక్ స్టడీ కూడా జరిగిందని సమాచారం. సీఎం జగన్ ట్రామ్ పరిశీలనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో ఆ దిశగా అడుగులు వేగంగా పడనున్నాయి. ట్రామ్ కార్ లను ప్రతిపాదిత రైల్వే స్టేషన్లను అనుసంధానించటం వలన సిటీ మొత్తం సర్క్యూట్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ పరిధిలోకి తీసుకొచ్చినట్లవుతుంది. ప్రభుత్వం ట్రాక్ లెస్ ట్రైన్ దిశగా అడుగులు వేస్తూ ఉండటంపై విశాఖ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: