నారా చంద్రబాబు నాయుడు.. ఆధునిక రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా ఒకప్పుడు చెప్పుకున్నారు. ఇలాంటి సీఎం తమకూ ఉంటే బావుండునని పక్క రాష్ట్రాల ప్రజలు అప్పట్లో కోరుకున్నారని ఆనాటి పత్రికలు రాశాయి. రాష్ట్రానికి సీఎంను కాదు.. సీఈవోను అని చెప్పుకునేందుకు ఇష్టపడిన ముఖ్యమంత్రి. ఎన్నికల సమయంలో తప్ప.. మిగిలన సమయాల్లో కేవలం అభివృద్ధి గురించే మాట్లాడతూ.. అని ఒకప్పుడు నొక్కి చెప్పిన వ్యక్తి.

 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను 9 ఏళ్లు పాలించిన వ్యక్తి. విభజిత ఆంధ్రప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రి. హైదరాబాద్ అభివృద్ధిలో చెప్పుకోదగ్గ పాత్ర పోషించాడని ప్రత్యర్థులు కూడా ఒప్పుకనేంతటి దార్శనికత ఉన్న నాయకుడు. పైన చెప్పిన వాటిలో ఏ ఒక్కటీ అతిశయోక్తి లేదు. అంతా వాస్తవానికి దగ్గరగా ఉన్న విషయాలే. కానీ ఇదంతా గతం.. ఘనంగా చెప్పుకునే గతంగానే మిగిలిపోతోందా..?

 

అవునంటున్నారు వైసీపీ నాయకులు. అమరావతి ఆందోళనలతో ఒక ప్రాంత, ఒక కుల నాయకుడిగా మిగిలిపోతున్నందుకు చంద్రబాబు సిగ్గుపడాలంటున్నారు. సిగ్గు, శరం వదిలేసి రాజధాని రైతులను రెచ్చగొట్టి దుర్మార్గమైన చర్య చేపట్టాలని కుట్రలు చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు. రాజధాని రైతులు భూముల కోసం పోరాటం అయితే.. ఉత్తరాంధ్ర, రాయలసీమ వాళ్లు అందరం బాగుండాలని పోరాటం చేస్తున్నారు. చంద్రబాబు మాత్రం దోచుకున్న సొమ్ము కోసమే పోరాటం చేస్తున్నాడని మండిపడుతున్నారు.

 

చంద్రబాబు నైజం వారి తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాటల్లో విన్నాం.. ధర్నా, బంద్‌ చేస్తే ఒక్క బస్సు అయినా, కారు అయినా తగలబడలేదా..? అని అడిగే వ్యక్తి చంద్రబాబు. అలాగే టీడీపీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీఆర్‌ కూడా చంద్రబాబును ఔరంగజేబుతో పోల్చిన సందర్భాలు కోకొల్లలు. చంద్రబాబు నాయుడికి వైజాగ్‌కు అభివృద్ధి చేస్తే, కర్నూలులో హైకోర్టు పెడితే వచ్చే నష్టం ఏంటీ.. ? అని నిలదీస్తున్నారు వైసీపీ నాయకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: