ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. జగన్ ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించిన తరువాత దాదాపు 4లక్షల వాలంటీర్లు మరియు సచివాలయ ఉద్యోగాల భర్తీ చేసిన విషయం తెలిసిందే. సీఎం జగన్ ఆదేశాల ప్రకారం మరోసారి గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాలకు రేపు నోటిఫికేషన్ విడుదల కానుంది. 15,971 గ్రామ, వార్డు సచివాలయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుంది.
 
అధికారులు పాత విధానంలో, పాత మార్గదర్శకాల ప్రకారమే భర్తీ ప్రక్రియ జరుగుతుందని చెబుతున్నారు. పంచాయతీరాజ్ శాఖ నిన్న(బుధవారం) గ్రామ, వార్డ్ సచివాలయాలలోని 19 రకాల ఉద్యోగాలలో ఏ పోస్టుకు ఎన్ని ఖాళీలు ఉన్నాయన్న వివరాలను తెప్పించుకుంది. అధికారవర్గాలు ఈ పోస్టుల్లో అత్యధికంగా పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ పోస్టులు ఉన్నట్టు చెబుతున్నాయి. 
 
విలేజ్ సర్వేయర్ అసిస్టెంట్ పోస్టులు 1234, గ్రామ ఉద్యాన అసిస్టెంట్ పోస్టులు 1746, డిజిటల్ అసిస్టెంట్ 1122 ఖాళీగా ఉన్నాయని సమాచారం. 2019 సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం 1,26,728 గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయగా దాదాపు 15,971 పోస్టుల భర్తీ జరగలేదు. భర్తీ కాకుండా మిగిలిపోయిన ఉద్యోగాలను ప్రభుత్వం మరోసారి నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్ష నిర్వహించి భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది. 
 
మరోవైపు ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలో మరో 300 సచివాలయాల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం జగన్ 300 సచివాలయాల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేయటంతో మరో 3,000 గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉందని తెలుస్తోంది. రేపు విడుదల కాబోయే నోటిఫికేషన్ ద్వారానే ఈ ఉద్యోగాల భర్తీ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. . అధికారంలోకి వచ్చిన 7 నెలలలోనే సీఎం జగన్ నిరుద్యోగులకు మేలు చేసేలా మరోసారి గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయనుండడంపై నిరుద్యోగుల నుండి హర్షం వ్యక్తమవుతోంది 

మరింత సమాచారం తెలుసుకోండి: