మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సిబిఐ విచారణ ఎదుర్కోనున్నారా? అంటే సిబిఐ వాదనలు పరిశీలిస్తే అవుననే స్పష్టం అవుతోంది . జగన్ అక్రమాస్తుల కేసులో ఆయన్ని  విచారించవచ్చునని దర్యాప్తు సంస్థ, సిబిఐ కోర్టు కు  నివేదించింది . వాన్ పిక్ కేసులో అవినీతి నిరోధక చట్టం కింద ఉన్న ఆరోపణలపై ధర్మాన పై సిబిఐ విచారణ చేపట్టేందుకు రంగం సిద్ధమైంది .

 

ప్రభుత్వం మారి మంత్రి పదవి లో ధర్మాన ప్రసాదరావు  లేకపోవడంతో అవినీతి నిరోధక చట్టం కింద ఉన్న కేసుల నిమిత్తం పరిగణలోకి (కాగ్ని జెన్స్) లోకి తీసుకుంటూ , సిబిఐ కోర్టు గతం లో జారీ చేసిన ఉత్తర్వులని సుప్రీం  కోర్టు సమర్ధించిన విషయాన్నీ ఈ సందర్బంగా దర్యాప్తు సంస్థ సిబిఐ,  కోర్టు కు తెలిపింది . ఈ విషయం లో హైకోర్టు ఉత్తర్వులను పక్కన పెట్టి , సిబిఐ కోర్టు ఉత్తర్వులను సమర్ధించిందని  గుర్తు చేసింది .

 

అందువల్ల అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టవచ్చునని పేర్కొంది . జగన్ అక్రమాస్తుల కేసులో అన్ని అంశాలను పరిశీలించిన సిబిఐ కోర్టు న్యాయమూర్తి మధుసూదన్ రావు , సిబిఐ దాఖలు చేసిన దరఖాస్తును పరిశీలించి , సుప్రీం కోర్టులో ధర్మాన కేసు  వ్యవహారం ఏ స్థాయిలో ఉందో చెప్పాలని ఆదేశించిన విషయం తెల్సిందే. వైఎస్ ప్రభుత్వం హయాం లో  వాన్ పిక్ కు అక్రమంగా  భూములను కట్టబెట్టారన్న ఆరోపణలున్నాయి .

 

వాన్ పిక్ భూముల కేటాయింపులో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని విపక్షాలు ఆందోళనలు , నిరసన కార్యక్రమాలు గతం లో చేపట్టాయి . వాన్ పిక్ కు కేటాయించిన భూములని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి .  వాన్ పిక్ కు  భూ కేటాయింపు వ్యవహారం లో క్విడ్ ప్రోకో జరిగిందని టీడీపీ  ఆరోపణలు చేసింది . 

మరింత సమాచారం తెలుసుకోండి: