ఒకరు స్మశానమని, మరోకారు ఎడారి అని, ఇంకొకరు ముంపు ప్రాంతమని అనడం ఎంత వరకు సబబు అని తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు ప్రశ్నించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రజలంతా బయటకు రావాలన్నారు . ఇది ఒక రాజకీయ పార్టీకి సంబందించిన సమస్య కాదని రాష్ట్రానికి, దేశానికి సంబందించిన సమస్య అని  అశోక్ గజపతి రాజు చెప్పారు. చంద్రబాబు ఆర్ధిక కుంభకోణాలతో జైలుకి వెళ్లిన వ్యక్తి కాదు. చంద్రబాబు సమర్ధమైన, అనుభవం ఉన్న నాయకుడు. సిఎం చిత్తూరు పర్యటన లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన విషయం పై చిత్తూరులో సిఎం కాన్వాయ్ కి అడ్డుపడి నిరసన వ్యక్తం చేస్తారని తెలిసిన పోలీసులు ముందస్తుగా మాజీ ఎమ్మెల్యే ఏ ఎస్ మనోహర్, ఎమ్మెల్సీ దొరబాబు, జిల్లా అధ్యక్షులు పులివర్తి నాని, రాష్ట్ర బీ సి సెల్ ప్రధాన కార్యదర్శి షణ్ముగంలను హౌస్ అరెస్ట్ చేసిన చిత్తూరు పోలీసులు. దీనిపై ఆయన తీవ్రంగా స్పందించారు.  శ్రీనగర్ లో ఉన్న పరిస్థితిని ఆంధ్ర ప్రదేశ్ లో తీసుకురావడం అన్యాయమన్నారు.

దుర్మార్గమైన చర్య..
రాష్ట్రంలో గమ్మత్తైన రాజకీయ పరిస్థితులు నెలకొని ఉన్నాయని  కేంద్ర మాజీ మంత్రి, టిడిపి సభ్యులు అశోక్ గజపతి రాజు అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పనులను, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కార్యక్రమాన్ని ఆపడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. గతంలో రాజశేఖర్ రెడ్డి పాదయాత్రలో గాని, వై ఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో గాని అరెస్టులు జరిగాయా అని ప్రశ్నించారు. ఏ రాష్ట్రంలో కూడా ప్రతిపక్ష నేతలు అరెస్ట్ సంస్కృతి లేదు.

ఇది సాధ్యమా..

జగన్ ప్రభుత్వం కొత్త సంస్కృతికి తెర తీసిందన్నారు.  రాజధాని భూములు తిరిగి చేస్తారన్న అంశం ఆశ్చర్యానికి గురిచేస్తుందని అన్నారు. ఇది ఆచరణలో సాధ్యమా ని సూటిగా ప్రశ్నించారు. అభివృద్ధిని  అడ్డుకుని రివర్స్ గెర్లో నడుస్తున్న ప్రభుత్వం ఇది. పోలవరం ఆపేసి విశాఖకు నీరు తెస్తాననడం ఎంత వరకు సాధ్యమని నిలదీశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. అభివృద్ధిలో అందరిని భాగస్వామ్యం చేసుకుని వెళ్ళాలి. అందరిని రోడ్డున పడేసే ప్రయత్నాలు మంచివి కాదన్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: