ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తాడేపల్లి నుండి మీడియాతో మాట్లాడుతూ 43 లక్షల మందికి 6,400 కోట్ల రూపాయలు జమ చేసినట్లు తెలిపారు. ఏ ముఖ్యమంత్రి చేయని సంక్షేమ కార్యక్రమాలు జగన్ చేస్తున్నారని అన్నారు. కొన్ని పత్రికలు, కొన్ని ఛానెళ్లు మాత్రం దుష్ప్రచారం చేస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వ పథకాలు విపక్షాలకు నచ్చటం లేదని బొత్స సత్యనారాయణ అన్నారు. ఏ పార్టీ మీద మాకు కోపం లేదని బొత్స సత్యనారాయణ అన్నారు. 
 
వైసీపీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం చేస్తోందని బొత్స సత్యనారాయణ చెప్పారు. ఈనాడు పత్రిక ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో రాజధానికి 1,09,000 కోట్లు కావాలని రాసిన ఈనాడు ఈరోజు అమరావతికి డబ్బులు అవసరం లేదని రాసిందని అన్నారు. ఎన్నికల ముందు ఒక రాత ఎన్నికల తరువాత ఒక రాత ఈనాడు పత్రికదని బొత్స చెప్పారు. 

ఎందుకు, ఎవరికోసం ఇలాంటి రాతలు రాస్తున్నారని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అందరికీ తెలిసిందే అని బొత్స సత్యనారాయణ అన్నారు. 13 జిల్లాలు అభివృద్ధి చెందాల్సిన అవసరం లేదా...? అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. అభివృద్ధి జరగడం ప్రతిపక్షాలకు ఇష్టం లేనట్టుంది అని బొత్స సత్యనారాయణ అన్నారు. శ్రీకృష్ణ కమిటీ, శివరామ కృష్ణ కమిటీ ఏం చెప్పిందో ప్రజలందరికీ తెలుసని బొత్స సత్యనారాయణ చెప్పారు. 

చంద్రబాబు, ఈనాడు పత్రిక కలిసి కుట్ర పన్నుతున్నారని బొత్స సత్యనారాయణ అన్నారు. మీకు నచ్చిన సీఎం అయితే ఒకలా రాస్తారా...? అంటూ ఈనాడును బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. రైతుల బాగు కోసం ఏనాడైనా చంద్రబాబు ఆలోచించారా...? అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. కుట్రలు మానుకుని వాస్తవాలు ఆలోచించాలని బొత్స సత్యనారాయణ సూచించారు. ఇలాంటి పనులు చేస్తే ప్రజలు ఎప్పటికీ క్షమించరని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: