రాజధాని నిర్మాణానికి రూ. లక్షా 9వేల కోట్లు కావాలని ఒకపత్రికలో వచ్చిన కథనాన్ని తప్పుపట్టిన మంత్రి బొత్స, దాన్ని సాకుగా చూపుతూ అసత్యాలు వల్లించాడని, తనవ్యాఖ్య లతో తనవిలువను తానే దిగజార్చుకున్నాడని టీడీపీ రాష్ట్ర అధికారప్రతినిధి గురజాల మాల్యాద్రి మండిపడ్డారు. అమరావతిలో ఇప్పుడేం జరుగుతుందో.. ప్రభుత్వం తీరుఎలాఉందో పూర్తివివరాలతో సహా ఒకపత్రిలో ప్రచురించారని, ఆవాస్తవాలను చూసి ఓర్వలేని బొత్స, తన అక్కసుని వెళ్లగక్కాడన్నారు. 

 


7నెలలనుంచి అమరావతి కేంద్రంగా పాలనచేస్తున్న వైసీపీ, అక్కడెంత ఖర్చుచేసిందో చెప్పాలన్నారు. రూపాయి కూడా ఖర్చుచేయకుండా, ఇప్పటివరకు పాలనసాగించారని, అమరావతి నిర్మాణాలకు ఎంతెంత ఖర్చయిందో, ప్రభుత్వం చెప్పిన లెక్కలఆధారంగా ప్రముఖపత్రిక ప్రచురించిం దన్నారు. అబద్ధాల సాక్షిని బలపరుస్తూ, వాస్తవాల చెబుతున్న మరోపత్రికపై విషం చిమ్మడాన్ని రాష్ట్రప్రజలెవరూ ఒప్పకోరని మాల్యాద్రి స్పష్టంచేశారు. 

 


గత ఐదేళ్లలో చంద్రబాబునాయుడి ప్రభుత్వం 6లక్షల17వేలకోట్ల అవినీతిచేసిందని, 25వేల ఎకరాలు  కబ్జాచేశారని సాక్షిలో కథనాలు ప్రచురించింది నిజంకాదా అని ఆయన ప్రశ్నించారు. ఆనాడు అలాఅసత్యాలు చెప్పి, అధికారంలోకి వచ్చాక అసెంబ్లీలో మాట్లాడుతూ 4వేల ఎకరాలు కాజేశారని మాటమార్చారన్నారు. సాక్షిలో వచ్చింది నిజమో.. అసెంబ్లీ లో చెప్పింది నిజమో బొత్స సమాధానం చెప్పాలన్నారు. 

 

 

చంద్రబాబు ముఖ్యమంత్రిగా జూన్‌8-2014న ప్రమాణస్వీకారం చేస్తే, సెప్టెంబర్‌4న అమరావతి రాజధానిగా ఉండాలని అసెంబ్లీలో తీర్మానించడం జరిగిందన్నారు. ఈ నాలుగునెలలమధ్యలో ఏవో ఒకటిరెండు రియల్‌ఎస్టేట్‌ కంపెనీలు 100ఎకరాలు కొన్నాయని, ఇంకో 28ఎకరాలు ఇతరుల పేరుతో రిజిస్ట్రేషన్స్‌ జరిగాయని టీడీపీనేత పేర్కొన్నారు. 28 ఎకరాల కొనుగోళ్లు జరిగితే, 28వేల ఎకరాలని దుష్ప్రచారం చేయడం వైసీపీకే చెల్లిందన్నారు. ఈవిధంగా పచ్చి అబద్ధాలు చెప్పడం సాక్షికే సాధ్యమైందన్నారు. డబ్బులు ఖర్చు చేయకుండా ఇప్పుడు ప్రభుత్వం తమపై అభాండాలు వేయడం దారుణమైన విషయం అని అయన తెలిపారు.  ప్రజలకు నిజానిజాలు తెలుస్తున్నాయని, ఎవరు తప్పు చేశారో తెలుస్తుందని అయన తెలిపారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: