విశాఖలో ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌, ఇతరమార్గాల్లో కబ్జాచేసిన తమభూముల విలువ పెంచు కోవడానికే, చట్టాలకు వ్యతిరేకంగా అక్కడికి రాజధానిని తరలిస్తున్నారని టీడీపీనేత ఒకరు పేర్కొన్నారు. రాజధాని ఎస్సీ నియోజకవర్గంలో ఉందని, అమరావతి చుట్టూ ఉన్న  4 నియోజకవర్గాలుకూడా ఎస్సీ రిజర్వుడు స్థానాలేనన్నారు. అలాంటి రాజధాని కేవలం ఒక సామాజికవర్గానిది ఎలా అవుతుందో బొత్స సమాధానం చెప్పాలన్నారు.  

 

తుళ్లూరు ప్రాంతంలో కమ్మవారికి ఉన్న భూములకన్నా, ఎక్కువభూములు తాడేపల్లి ప్రాంతంలో రెడ్లకు ఉన్నాయన్నారు. రాజధాని ప్రాంతంలో 40శాతం దళితులుంటే,  మంగళగిరి బీసీల కేంద్రంగా ఉందని, విజయవాడ, గుంటూరుప్రాంతాల్లో ముస్లింలు , క్రిస్టియన్లు, వైశ్యులు, కాపులు, మైనారిటీలు ఉన్నారన్నారు. అన్నికులాల సమాహారంగా ఉన్న ప్రాంతంపై కావాలనే సామాజికవర్గం పేరుతో విషం చిమ్ముతున్నారని మాల్యాద్రి  దుయ్యబట్టారు. 

 

29గ్రామాల్లోని 15 గ్రామాల్లో బొత్ససామాజికవర్గం వారే ఎక్కువ ఉన్నారనే విషయాన్ని ఆయన తెలుసుకోవాలన్నారు. గతంలో కూడా రాజధాని ముంపు ప్రాంతమని, నిర్మాణఖర్చు ఎక్కువవుతుందని తప్పుడుప్రచారం చేశారన్నారు. నేషనల్‌ గ్రీన్‌ట్రిబ్యునల్‌ అమరావతిలో ముంపేరాదని చెప్పినాకూడా, మంత్రిగా ఉన్న బొత్స పదేపదే అదేపట్టుకొని దుర్మార్గపు ప్రచారం చేశాడన్నారు. చెన్నై, బెంగుళూరు, హైదరాబా ద్‌లకంటే, అమరావతిలోనే నిర్మాణఖర్చు తక్కువని చెన్నై ఐఐటీబృందం చెప్పిన వాస్తవా   లు బొత్స తలకెక్కలేదా అని మాల్యాద్రి నిగ్గదీశారు. నారాయణ కమిటీ ల్యాండ్‌పూలింగ్‌ కోసం వేస్తే, దాన్ని కూడా తప్పుపడుతున్నారన్నారు. 

 

కేంద్ర ఆమోదంతో, చట్టబద్ధంగా వేసిన శివరామకృష్ణన్‌ కమిటీ అన్నిప్రాంతాలను పరిశీలించి విజయవాడప్రాంతమే రాజధానికి అనుకూలమని నిర్ధారిస్తే, దానిపై కూడా దుష్ప్రచారం చేయడం అబద్ధాల బొత్సకే సాధ్యమైందన్నారు. ధర్మాన, బొత్స, విజయసాయిలు విశాఖ కేంద్రంగా కబ్జా చేసిన తమభూములకోసమే, వారి వ్యక్తిగతలాభంకోసమే పూటకోరకంగా అబద్ధాలు చెబుతున్నారని టీడీపీనేత తేల్చిచెప్పారు. నిత్యం అబద్ధాలు చెప్పే సాక్షిని ప్రామాణికంగా తీసుకొని, వాస్తవాలు వెల్లడించేవారిపై విషం చిమ్మడం మానుకోవాలని మాల్యాద్రి హితవుపలికారు. ఇకనుంచైనా అబద్ధాలు చెప్పడంమాని, ప్రజలపక్షాన నిలిస్తే, వారు  హర్షిస్తారనే విషయాన్ని బొత్స, ఇతరనేతలు గ్రహించాలన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: