ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి మంచిబుద్ధిని, ఇంగితాన్ని ప్రసాదించాలని కోరు తూ దుర్గమ్మను ప్రార్థించడానికి, మొక్కుబడులు చెల్లించడానికి వెళుతున్న అపరదుర్గలపై పోలీసులసాయంతో దాష్టీకం చేయడాన్ని చూస్తుంటే విజయవాడలో ఉన్నామా..లేక పాకిస్తాన్‌లో ఉన్నామా అనే అనుమానం కలుగుతోందని టీడీపీ మహిళానేత, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తంచేశారు. .ముఖ్యమంత్రి హోదాలో నిస్సిగ్గుగా సీబీఐకోర్టుకి హాజరవుతున్న తనబాగోతం గురించి రాష్ట్రప్రజలకు తెలియకూడ దన్న దుర్భుద్ధితో దిగజారిమరీ జగన్‌, మహిళలపై అమానుషత్వం ప్రదర్శించాడన్నారు.  

 

 దిశచట్టం తీసుకొచ్చామని జబ్బలు చరుచుకున్న ముఖ్యమంత్రి, ఈనాడు సిగ్గులేకుండా మహిళలపై చేయిచేసుకునేలా ప్రవర్తించాడని, తాను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడా నికి తనతల్లి, చెల్లిలాంటి ఎందరో మహిళలుపెట్టిన భిక్షనే విషయాన్ని ఆయన మర్చిపో యాడని అనిత మండిపడ్డారు. పాదయాత్రలో అక్కా, చెల్లీ అంటూ ముద్దులుపెట్టిన  వ్యక్తి, తనను 16నెలలు జైల్లోకూర్చోపెట్టారన్న కక్షతో, రాష్ట్రప్రజలపై అక్కసు వెళ్లగక్కుతు న్నాడన్నారు. ఆడదాని శోకం, రైతుల కన్నీరు రాష్ట్రానికి మంచిదికాదనే నగ్నసత్యాన్ని  తెలుసుకోకుండా, 144సెక్షన్లతో అందరినీ అడ్డగిస్తున్న జగన్మోహన్‌రెడ్డికి ఆడబిడ్డల ఉసురు తప్పకుండా తగులుతుందన్నారు. సహజంగా సీఎంను కలవడానికి, తమ సమస్యలు చెప్పుకోవడానికి ప్రజలు వెళుతుంటారని, కానీ ఇప్పుడున్న దిక్కుమాలిన సీఎంను ఎవరూ కలవకూడదంటూ, 144సెక్షన్‌పెట్టి, చుట్టూ తాళ్లుపట్టుకొని పోలీసులు   రోడ్లపై నిలుచుంటున్నారని ఆమె దుయ్యబట్టారు. 

 

ప్రజలదగ్గరకు వెళ్లి, వారిముఖం కూడా చూడలేని, మూగబోయిన ముఖ్యమంత్రిని ఈరాష్ట్రంలోనే చూస్తున్నామన్నారు. ప్రజల భవిష్యత్‌తో పబ్జీగేమ్‌ ఆడుకుంటున్న ఇలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసినందు కు ప్రజలంతా తమచెప్పులతో తామే కొట్టుకునే పరిస్థితిని రాష్ట్రంలో చూస్తున్నామన్నారు.  మహిళల్ని బాధిస్తున్న, భక్షిస్తున్న వ్యక్తి వారికి 'అన్న' ఎలా అవుతాడని, స్త్రీలంటే జగన్‌కు చిన్నచూపని, అందుకే తనచెల్లిని, తల్లినికూడా బయటకు రాకుండా కట్టడి చేశాడన్నారు. 

 

ఒక్క ఛాన్సంటూ ఆనాడు బతిమాలి, మహిళలు చేస్తున్న త్యాగాల్ని తూలనాడుతూ, ఐదోతనంగా భావించే తాళిబొట్లను గురించి అపహాస్యం చేయడమే నేడుపనిగా పెట్టుకున్నాడన్నారు. ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగంపై నమ్మమున్న వారెవరూ దేవాలయంలాంటి అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాన్ని, రైతుల త్యాగాలను అపహస్యం చేయరన్నారు. ఆడబిడ్డలు బయటకువచ్చారంటే రాష్ట్రపరిస్థితి ఎంతగా దిగజారిందో అర్థంచేసుకోవచ్చన్నారు. ఉత్తరాంధ్రమహిళగా రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తున్నట్లు అనిత తెలిపారు.

 

రాజధాని ఉద్యమం జరుగుతుంటే, బయటకురాలేని దుస్థితిలో వైసీపీఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారని, ప్రజల్లోకి వెళ్లే ధైర్యంలేక తెరవెనుకనుంచి చంద్రబాబుపై విమర్శలుచేస్తూ, అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారని అనిత ఆగ్రహం వ్యక్తంచేశారు. తనను లక్ష్యం చేసుకోవద్దని, ప్రజలగురించి ఆలోచించాలని చంద్రబాబునాయుడు పదేపదే విజ్ఞప్తిచేస్తున్నా, వైసీపీనేతలు ఆయనపై బురదజల్లడం మానుకోవడంలేదన్నారు.  విజయవాడలో మహిళలు తలపెట్టిన శాంతియుతర్యాలీని భగ్నంచేయడానికే ప్రభుత్వం     అమరావతి సాక్షిగా అబలలపై దారుణానికి పాల్పడిందన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: