జగన్‌ను మించిన తీవ్రవాది రాష్ట్రంలో ఎవరూ ఉండరని, మహిళలు చేసే కార్యక్రమాన్ని   కూడా అడ్డుకోవాలని చూస్తున్న ఆయనబుద్ధిని చూస్తుంటే సిగ్గేస్తోందన్నారు. ఆడవాళ్లను  రక్తమొచ్చేలా కొట్టినందుకు, గోళ్లతో రక్కినందుకు, చీరలు లాగుతూ ఇష్టానుసారం ఈడ్చికెళ్లినందుకు జగన్‌పై దిశచట్టం మోపి, 21రోజుల్లోనే ఆయన్ని శిక్షించాలని అనిత డిమాండ్‌చేశారు. 

 

ఆడపోలీసులు లేకుండా మగవారితో మహిళల్ని అడ్డగించడం   ఏచట్టం పరిధిలోకి వస్తుందని ఆమె ప్రశ్నించారు. పోలీసులు విధినిర్వహణపేరుతో దుందుడుకుగా వ్యవహరించడం సరికాదన్నారు. గుడికివెళ్లే మహిళలపై ప్రతాపం చూపిన మగాడిగా జగన్మోహన్‌రెడ్డిని గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కించాలన్నారు. ''ఇళ్లలో మగవా ళ్లు లేరా.. మహిళలు రోడ్లపైకి వస్తున్నారు''... అమరావతి ఉద్యమంలేదు..ఊరగాయ బద్ధా లేదు'' అని మాట్లాడేవారంతా ఒక్కసారి రాజధాని మహిళలమధ్యకు వస్తే, అక్కడ జరిగేదేంటో తెలుస్తుందన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణలేకుండా పోయింద ని, మహిళార్యాలీని అడ్డుకోవడం ద్వారా జగన్మోహన్‌రెడ్డి వారికి భయపడ్డాడని అర్థమైం దన్నారు. రాష్ట్రమహిళాకమిషన్‌ చైర్‌పర్సన్‌కు నిజంగా మహిళలపై చిత్తశుద్ధిఉంటే, ఆమె తక్షణమే రాజధాని మహిళలకు సంఘీభావం తెలియచేయాలన్నారు. 

 

 ముఖ్యమం త్రి జగన్‌ మహిళలపట్ల ప్రవర్తించిన రాక్షసత్వాన్ని సుమోటాగా స్వీకరించి, ఆయనపై దిశచట్టం మోపి చర్యలు తీసుకోవాలని, అమరావతి రక్షించి, రాష్ట్రానికి గుర్తింపు ఇవ్వాలని జాతీయ మహిళాకమిషన్‌కు, కేంద్రప్రభుత్వానికి అనిత విజ్ఞప్తిచేశారు. ఒక మహిళ రాష్ట్రానికి హోంమంత్రిగా ఉన్నారని, ఇంతజరుగుతున్నా, రైతులు చనిపోయినా ఆమెఏనాడూ వారికుటుంబాలను పరామర్శించలేదని అనిత మండిపడ్డారు . తానొక మహిళలననే విషయాన్ని హోంమంత్రి గుర్తించాలన్నారు. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి రిజర్వుడు స్థానంనుంచి పోటీచేశారని, ఎస్సీకోటాలో ఎమ్మెల్యేగా గెలిచిన ఆమెకు అంబేద్కర్‌ ఎవరో తెలియకపోవడం దారుణమన్నారు. అలాంటి ఆమెకు రాజధాని రైతుల కష్టాలు, వారిబాధలు ఎలా తెలుస్తాయని, ఆమెగురించి పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదన్నారు.

 

ర్యాలీలు, ధర్నాలకు వైసీపీనేతలకు, మంత్రులకు అనుమతులు ఇస్తున్న ప్రభుత్వం, అమరావతి రైతులకు, మహిళలకు ఎందుకు ఇవ్వదని, వారికొకన్యాయం, ప్రజలకు ఇంకోన్యాయమా అని, ఇదేనా డీజీపీ చెప్పిన భావప్రకటనస్వేచ్ఛా అని అనిత నిలదీశారు. ఉద్యోగధర్మం చేయకుండా, వైసీపీవారికి తొత్తులుగా వ్యవహరించవద్దని పోలీసువారిని కోరుతున్నామన్నారు. టీడీపీ కార్యకర్తల అంతుచూసే మగాళ్లెవరూ రాష్ట్రంలో లేరన్నారు. వారిని డైరెక్ట్‌గా ఎదుర్కోలేకే పోలీసులను అడ్డుపెట్టుకొని సాధిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి హోదాలో సీబీఐకోర్టుకి హాజరైన వ్యక్తిగా జగన్‌ చరిత్రలో నిలిచిపోయాడని, హైపవర్‌కమిటీయే.. పవర్‌లేని కమిటీయే తెలియడం లేదని అనిత ఎద్దేవాచేశారు. 

 

ప్రభుత్వం ఎన్నికమిటీలేసినా, అందులో మేథావులు, మాజీ అధికారులు, మాజీ న్యాయమూర్తులు, అఖిలపక్షనేతలకు  స్థానం ఉండదని, రెడ్లకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుందన్నారు. వారంవారం కోర్టు మెట్లెక్కే ముఖ్యమంత్రి, హైకోర్టు ఎక్కడ ఉండాలో నిర్ణయించాల్సిన దుస్థితి రావడాన్ని రాష్ట్రంలో చూస్తున్నామన్నారు. చంద్రబాబు జోలెపట్టినా, భువనేశ్వరి గాజులిచ్చినా అమరావతి రైతులకోసమేనని, దానిపై కూడా శవరాజకీయాలు చేస్తున్న వైసీపీవారికి  ఒకదండమన్నారు. రాజధాని మహిళలపై జరిగిన దాడికి, అమరావతిలో జరిగిన చావులకు ముఖ్యమంత్రే బాధ్యుడవుతాడని అనిత తేల్చిచెప్పారు.    

మరింత సమాచారం తెలుసుకోండి: