ప్రతి వ్యక్తి డబ్బు సంపాదించాలి అన్న ఆలోచనలతోనే కాలాన్ని గడిపేస్తూ ఉంటాడు. డబ్బు సంపాదించాలనే కోరిక లేని వ్యక్తి ప్రపంచంలో ఉండడు. వాస్తవానికి డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఉన్నా తలలు పండిన మనీ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్స్ మాత్రం 5 మార్గాలను సూచిస్తున్నారు.  ఈ మార్గాలలో ఎవరైనా న్యాయ బద్ధంగా అతి తక్కువ పెట్టుబడితో కూడ డబ్బు సంపాదించవచ్చు. 


చాలామంది వారు పొదుపు చేసుకున్న మొత్తాలను బ్యాంకు ఖాతాలో అలాగే ఉంచుకుంటారు. అయితే ఆ డబ్బును అలా ఉంచకుండా ఆ డబ్బును మరిన్ని మార్గాల్లో పెట్టుబడి పెడితే ఎంతో కొంత ఆదాయం వస్తుంది. అయితే ఎందులో పెట్టుబడి పెడితే ఎంత లాభం? అన్నది తెలుసుకుంటేనే డబ్బును సరైన పద్ధతిలో ఇన్వెస్ట్ చేసి ఫలితం పొందగలుగుతారు. 

ముఖ్యంగా చాలామంది తమ పొదుపు మొత్తాలను లిక్విడ్ ఫండ్స్ రూపంలో ఉంచుకుంటారు. దీనివల్ల 6 నుండి 8 శాతం రిటర్న్స్ వస్తాయి. దీనీలో ఎలాంటి లాక్-ఇన్ పీరియడ్ ఉండదు. ఒక విధంగా చెప్పాలి అంటే ఇలాంటి పెట్టుబడులను లో-రిస్క్ ఇన్వెస్ట్‌మెంట్స్ గా పరిగనిస్తారు. దీనిపై వచ్చే లాభాలకు పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఇక మన పొదుపు మొత్తాలను ఫిక్స్‌డ్ డిపాజిట్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే 3-7 శాతం  రిటర్న్స్ వస్తాయి ఎప్పుడైనా డబ్బులు తీసుకోవచ్చు. ఎక్కువ కాలం ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే వడ్డీ ఎక్కువగా ఇస్తుందిబ్యాంక్. ఎలాంటి రిస్క్ తీసుకోలేని వారికి ఈ ఫిక్సెడ్ డిపాజిట్లు శ్రీరామ రక్ష. 

అయితే మనకు డబ్బులు ఎప్పుడు అవసరం అవుతాయి ఎప్పుడు వెనక్కి తీసుకోవాలి అన్న ప్లానింగ్ ఉండాలి. ఇక డబ్బు తెలివిగా సంపాదించే మార్గాలలో ప్రముఖంగా చెప్పుకోతగ్గది ఈక్విటీ మార్కెట్. ఇందులో రిటర్న్స్ ఎంత వస్తాయన్నది చెప్పలేకపోయినా బ్యాంక్ లో దాచుకున్న మొత్తాల పై వచ్చే వడ్డీకన్నా ఎక్కువగా వస్తుంది. అయితే డబ్బులు వెనక్కు రావాలి అంటే ఒకటి రెండు రోజులు ఆగవలసి ఉంటుంది. స్టాక్‌ మార్కెట్‌లో తెలివిగా పెట్టుబడులతో ఎంతైనా సంపాదించొచ్చు. రిస్క్ వద్దు అనుకునే వారికి కుంటే సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ద్వారా మ్యూట్యువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా రియల్ ఎస్టేట్ బంగారం వెండి పై కూడ మన పొడుపు మొత్తాలను ఇలా రకరకాల వాటి పై డబ్బు పెట్టుబడి పెడితే ఒకొక్క సీజన్ లో ఆ సీజన్ కు తగ్గ లాభాలను చాల సులువుగా పొందవచ్చు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: