సెలవులొస్తున్నాయంటే చాలు పర్యాటక ప్రాంతాలకు చెక్కేయడం సర్య సాధారణమే. సెలవుల్లో కొంత మంది స్వగ్రామాలకు వెళ్ళతారు. మరి కొంత మంది పుణ్యక్షేత్రాలను  దర్శించుకుంటుంటారు. ఇంకొందరైతే జామ్ జామున విహార యాత్రలో విహరిస్తుంటారు. అందుకే సెలవులు దొరికితే చాలు పిల్లల్లోనూ, పెద్దల్లోనూ పర్యాటక ప్రాంతాలు గుర్తుకొస్తాయి.  చాలామంది విహారయాత్రలకు మాత్రం అప్పటికప్పుడు స్పందిస్తుంటారు. రోజుకి పన్నెండు గంటలు కార్పొరేట్ తరగతి గదుల్లో మగ్గి మసిబారిపోతున్న పిల్లలకు ఇవి కాస్తంత ఉత్సాహాన్ని, కొండంత ఆనందాన్నిస్తాయి. మరి కొందరు విదేశీయానానికి  ప్రయాణమే కడతారు. ఈ సారి అలాంటి యాత్రికుల కోసం పలు దేశాలు చక్కని అవకాశాలను కల్పిస్తారు. సాధారణంగా విదేశాల్లో ఏ ప్రాంతాన్ని అయినా పర్యటించాలంటే వీసాలతో చాలా చిక్కులు ఎదురువుతుంటాయి. ఇండియన్ పాస్ పోర్టు ఇప్పుడు చాలా పటిష్టంగా మారింది. దీంతో చాలా దేశాలు ఇప్పుడు భారతీయులకు వీసా-ఫ్రీ ఎంట్రీకి అనుమతి ఇస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు వీసా విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. విదేశాల్లో పర్యటించేందుకు సిద్ధపడే భారతీయులకు బంపర్ ఆఫర్. దాదాపుగా  58 దేశాల్లో వీసా లాంఛనాలు లేకుండానే పర్యటించవచ్చు. మరి పరిణామం సంతోషదాయకమే కదా.


15 రోజుల ఉచిత ఈ -వీసా  :
అంతేకాదు.. భారతీయ పాస్ పోర్టుదారులు మలేసియా, యూనైటెడ్ ఎమిరేట్స్ దేశాలకు 15 రోజుల ఉచిత ఆన్ లైన్ వీసాను కూడా పోందవచ్చు. కానీ, చాలా దేశాల్లో మాత్రం, భారతీయులు పర్యటించాలంటే తమ ప్రయాణ సమయం నుంచి కనీసం 6 నెలల్లో పాస్ పోర్టు చెల్లుబాటు అయ్యేలా చూసుకోవాలి. వీసా ఆన్ అరైవల్ తప్పనిసరిగా అయిన విదేశాలకు వెళ్లే భారతీయులంతా తమ వెంట పాస్ పోర్ట్ సైజ్ ఫొటోగ్రాఫ్స్, కాన్ఫిర్మేడ్   రిటర్న్ టికెట్లు తీసుకెళ్లాల్సి ఉంటుంది. కానీ, కొన్ని దేశాల్లో మాత్రం.. భారతీయులు ఎంట్రీ ఫీజు చెల్లించడంతో పాటు ఒక అప్లికేషన్ ఫాం కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. అంతేకాదు.. ట్రావెల్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అడిగే అవకాశం ఉంది. ఎక్కడ ఉండబోతున్నారు.. ఎంత మొత్తంలో నగదు ఉందో కూడా ప్రూఫ్ గా చూపించాల్సి ఉంటుంది.


 84వ ర్యాంకులో భారత్..
 హెన్లే పాస్ పోర్ట్ సూచిక 2020 డేటా ప్రకారం.. ప్రపంచ పవర్ ఫుల్ పాస్ పోర్టుల్లో భారతీయ పాస్ పోర్టు 84వ ర్యాంకులో నిలిచింది. ఈ జాబితాలో జపాన్ పాస్ పోర్ట్ టాప్ ర్యాంకులో నిలిచింది. ఎందుకుంటే జపాన్ పౌరులకు వీసా ఫ్రీ ఎంట్రీ కింద 191 దేశాలు అనుమతి ఇస్తున్నాయి. అదేవిధంగా, సింగపూర్, జర్మనీ, దక్షిణ కొరియా దేశాల పాస్ పోర్టులు సైతం చాలా పటిష్టంగా ఉండటంతో ప్రపంచంలోని దాదాపు 150 దేశాలు వీసా-ఫ్రీ ఎంట్రీలకు ఆమోదం తెలిపాయి. దక్షిణ ఆసియాలో ఇండియా టాప్ ర్యాంకులో నిలిచింది. ఎలాంటి వీసా లాంఛనాలు లేకుండానే ఈజీగా ప్రపంచంలోని 58 దేశాలకు హాయిగా పర్యటించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: