కుట్రపూరితంగా రాజధానిని అమరావతిలో ఏర్పాటు చేయాలని చంద్రబాబు నిర్ణయించడం మోసపూరిత ఆలోచనలకు నిదర్శనమని కమలనాధులు మూటముటలాడుతున్నారు. లక్ష కోట్లతో సింగపూర్ స్థాయి రాజధాని నిర్మాణం పూర్తి కాదని శివరామకృష్ణన్ కమిటీ తేల్చి చెప్పిన విషయాన్ని ఈ సందర్బంగా ప్రస్తావిస్తున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తీరుపై బీజేపీ కోర్‌ కమిటీ తీవ్రస్థాయిలో మండిపడింది. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను చంద్రబాబు బుట్ట దాఖలు చేసి ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

అమరావతిలో రాజధాని నిర్మాణం కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై భారం పడుతుందని చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదంటూ మండిపడింది. కమిటీ నివేదికను చర్చించకుండా చంద్రబాబు స్వలాభపేక్షతో రాజధానిని అమరావతిలో ఏర్పాటు చేశారని తెలిపింది. రాజధానిలో రాష్ట్ర నాయకత్వం జోక్యం అవసరం లేదని చంద్రబాబు వ్యతిరేక వర్గం నేతలు స్పష్టం చేశారు.

రాజధానిపై సుజనా చేస్తున్న వ్యాఖ్యలు ఇంకా టీడీపీ వ్యాఖ్యల్లానే ఉన్నాయని అన్నారు. ఇప్పటికీ టీడీపీ ఎజెండాతోనే సుజనా పనిచేస్తున్నారని బీజేపీ కేంద్ర నేతలు మండిపడ్డారు. రాజధాని విషయంలో సుజనా తీరును వారు తప్పుబట్టారు. బీజేపీలో చేరినా సుజనాకు ఇంకా టీడీపీ వాసన పోలేదని పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

చంద్రబాబు అనుకూల వర్గం మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించింది. గతంలో రాజధానికి కేంద్రం నిధులు ఇచ్చిందని, రాజధాని తరలింపుపై కేంద్ర అభిప్రాయం కోరుదామని, రాజధాని తరలించకుండా పోరాటం చేయాలనే అభిప్రాయాన్ని చంద్రబాబు అనుకూల వర్గం నేతలు వ్యక్తం చేశారు. దీనితో రాజధాని విషయంలో ఏపీ బీజేపీ నాయకులు రెండుగా చీలిపోయారు.

చంద్రబాబు అనుకూల, వ్యతిరేక వర్గాలుగా రాజధానిపై అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కోర్ కమిటీ మీటింగ్‌లో రాజధానిపై భిన్నాభిప్రాయాలు తెలిపారు. రాజధాని అనేది కేంద్ర పరిధిలోని అంశమని, అభివృద్ధి వికేంద్రీకరణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే ఉత్తరాంధ్ర, రాయలసీమలో పార్టీ నష్టపోతుందని వారు తెలిపారు.  బీజేపీ నేత సుజనా చౌదరిపై బీజేపీ కేంద్ర నేతలు ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: