ఎల్లో మీడియా.. వాస్తవానికి ఎల్లో మీడియా అంటే ఉన్న అర్థం వేరు.. కానీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు అనుకూల మీడియాకు ఈ ఎల్లో మీడియా అన్న పదాన్ని ఏ ముహూర్తాన తెలుగు జర్నలిజంలో ఖాయం చేశారో కానీ.. మీడియా సంస్థలు కూడా ఆ రేంజ్ కు ఏమాత్రం తగ్గడం లేదు. తమ అభిమాన నాయకుడు రాజధానిని అమరావతి నుంచి తరలించేందుకు ఇష్టపడటం లేదు కనుక.. ఈ ఎల్లో మీడియా కూడా అదే స్టాండ్ తీసుకుంది.

 

ఇక అప్పటి నుంచి అమరావతిని రాజధానిగా ఎందుకు కొనసాగించాలో చెబుతూ పుంఖానుపుంఖాలుగా కథనాలు వండివారుస్తున్నాయి. ఈ కథనాల ప్రతాపం ఎక్కడిదాకా వెళ్లిందంటే.. రాష్ట్రాలు, దేశాలు, ఖండాలు దాటి.. అసలు ప్రపంచంలో అమరావతి మోడల్ ఎక్కడెక్కడ ఉందో అవన్నీ ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ అమరావతే బెస్ట్ అని చెప్పేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఇదే సమయంలో మన పక్కనే ఉన్న మద్రాసు ఐఐటీ అమరావతిపై చేసిన అధ్యయనం మాత్రం వీరి దృష్టికి రాదు. వచ్చినా అది ఈ ఎల్లో మీడియాకు వార్త కాదు.

 

ఎందుకంటే.. అది తమ ఎల్లో మీడియాకు నచ్చే వార్త కాదు. ఇంతకీ మద్రాసు ఐఐటీ ఏం చెప్పిందంటే.. " చంద్రబాబు సర్కారు రాజదాని భవనాల నిర్మాణానికి ఎంపిక చేసుకున్న ప్రదేశం భారీ నిర్మాణాలకు ఏ మాత్రం అనువుగాదని తేల్చిచెప్పింది. ఈ నివేదికను గతంలోనే ఈ యూనివర్శిటీ ఇచ్చింది. అయినప్పటికీ ఆ నివేదికతో నిమిత్తం లేకుండా చంద్రబాబు ప్రభుత్వం ముందుకు వెళ్లింది.

 

తాజాగా మద్రాసు ఐఐటి నివేదికలోని అంశాలను హిందూ పత్రిక కథనంగా ప్రచురించింది. దాని ప్రకారం నదీ తీరాన రెండున్నర మీటర్ల నుంచి ఐదు మీటర్ల లోపు నీరు వస్తుందని, అక్కడ నిర్మాణాలు చేయడం సరికాదని మద్రాసు ఐఐటీ అభిప్రాయపడింది. రాజదానికి ఎంపిక చేసుకున్న ప్రదేశంలో 70 శాతం వరద ప్రభావితం అని స్పష్టం చేసింది. అంతే కాదు.. పైల్ ఫౌండేషన్ అయినా, రాఫ్ట్ ఫౌండేషన్ అయినా ఖరీదైన విషయమని ఐఐటి మద్రాస్ నివేదిక స్పష్టం చేసింది. అయినా ఇది మన ఎల్లో మీడియాకు వార్త కానే కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: