సంక్రాంతి పండగ రోజున చాలామంది ఉదయాన్నే లేచి స్నానం చేస్తుంటారు.  అయితే, కొందరు మాత్రం ఉదయాన్నే లేచేందుకు బద్దకిస్తాను.  అది ముమ్మాటికీ మహా పాపం అని చెప్పాలి.  ప్రతి రోజు ఉదయాన్నే లేచి అందరు స్నానం చేయాలని కోరుకుంటారు.  ఎందుకంటే ఉదయాన్నే లేచి స్నానం చేయడం వలన మనిషి చాలా యాక్టివ్ గా ఉంటారు.  అది అందరికి తెలిసిన విషయమే.  కానీ, కొంతమంది మాత్రం బద్దకంగా ఎప్పుడో నిద్రలేచి కూల్ గా స్నానం చేస్తుంటారు.  


అలా చేయడం వలన ఇబ్బందులు వస్తుంటాయి.  అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, మకర సంక్రాంతికి ఆయనం మారుతుంది.  ఇప్పటి వరకు ఉన్న దక్షిణాయనం కాస్త రేపటి నుంచి ఉత్తరాయణంగా మారుతుంది.  ఈ ఉత్తరాయణం అత్యంత ఉత్తమమైనది.  ఉత్తరాయణంలో చాలామంది స్వర్గలోక ప్రాప్తిని పొందాలని చూస్తుంటారు.  ఎంతో శ్రేష్టమైన కాలం ఇది.  ఈ కాలంలో ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసి, ప్రాతకాలంలో విష్ణు దేవాలయాలని వెళ్లి పూజలు నిర్వహిస్తే... అనుకున్న పనులు సకాలంలో పూర్తి అవుతాయని నమ్మకం.  


ఈ నమ్మకంతోనే ప్రజలు ఎక్కువగా దేవునికి పూజలు చేస్తుంటారు.  ఈ నమ్మకంతోనే ప్రజలు భక్తి శ్రద్దలతో దేవునికి మొక్కుతుంటారు.  ఈ భక్తి శ్రద్దలే మనిషికి మరో ప్రాణంగా నిలుస్తాయి.  భక్తితో పూజించే ప్రతి ఒక్కరికి భగవంతుని కృపాకటాక్షం తప్పనిసరిగా ఉంటుంది.  అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు.  


ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం కూడా ఉండదు.  అలా కాకుండా భక్తి శ్రద్దలతో పనులు చేయకుండా అన్నింటిని పెండింగ్ లో పెడితే మాత్రం ఇబ్బందులు పడాల్సి వస్తుంది.  ఎవరికీ కాకుండా పోతుంది.  అందుకే ప్రతి విషయాన్నీ చక్కగా అవగాహనా చేసుకుంటూ చక్కగా పనులు చక్కదిద్దుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  అందరి పనులు సులువుగా సాగుతుంటాయి.  అంతకంటే కావాల్సింది ఏముంటుంది చెప్పండి.  

మరింత సమాచారం తెలుసుకోండి: