సంక్రాంతికి సందడి చేసిన సినిమాల్లో మహేశ్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు కూడా ఉంది. సూపర్ స్టార్ ఇమేజ్ తో పర్ఫెక్ట్ మాస్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాలో మహేశ్ పవర్ ఫుల్ ఆర్మీ మేజర్ పాత్రలో, ఓ కుటుంబాన్ని ఆదుకునే కొడుకు పాత్రలో రెండు వేరియేషన్లలో తన సత్తా చాటాడు. ముఖ్యంగా ఈ సనిమాలో మిలిటరీ నేపథ్యం సినిమాకు ప్లస్ అయిందనే చెప్పాలి. కేవలం ఓ సైనికుడిగా మాత్రమే మహేశ్ పాత్రను తీర్చిదిద్దకుండా ఆపాత్ర ప్రాధాన్యం పెంచటం సినిమాకు ప్లస్ అయింది. ఈరోజు ఇండియన్ మిలిటరీ డే కావడంతో టీమ్ సరిలేరు నీకెవ్వరు యూనిట్ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది.

 

 

‘సెల్యూటింగ్ ది రియల్ హీరోస్’ పేరుతో మహేశ్ మిలిటరీ గెటప్ లో ఉన్న ఫొటోతో ఆ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ‘ఆనందం, పండగ అనే వాటికి అన్నిటికీ దూరంగా, మన రక్షణే ధ్యేయంగా పని చేస్తున్న సైనికులందరికీ, తెలుగు ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు’ అని సైనికుల త్యాగాన్ని పొగుడుతూ సినిమా యూనిట్ సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్ లో రిలీజ్ చేసింది. ఇప్పటికే ధియేటర్లలో సందడి చేస్తున్న ఈ సినిమా ఫ్యాన్స్ ను, ప్రేక్షకులను అలరిస్తోంది. దేశ రక్షణలో భాగంగా, సైనికుడిగా దేశాన్ని కాపాడుకుంటూ.. ఓ కుటుంబాన్ని కూడా సైనికుడిలా సమాజంలోని కొన్ని రాజకీయ శక్తుల నుంచి కాపాడే పాత్రలో మహేశ్ పాత్ర ఉంటుంది.

 

 

సినిమాలో సైనికుల గొప్పదనం, వారి త్యాగనిరతిని కీర్తిస్తూ మహేశ్, విజయశాంతిల మధ్య వచ్చే ఎపిసోడ్ ఆకట్టుకుంటోంది. దేశ సైన్యం గొప్పదనాన్ని ఈ సినిమాలో బాగా చూపించారని ప్రేక్షకులు అంటున్నారు. మాస్ కామెడీ, ఫ్యామిలీ కాన్సెప్ట్, మహేశ్ చాన్నాళ్ల తర్వాత చేసి కామెడీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా ధియేటర్లలో సందడి చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: