సంక్రాంతి వచ్చింది అంటే పల్లెటూరిలో హడావుడి ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పక్కర్లేదు.  పండగ రోజున చేసే హడావుడి పక్కన పెడితే, దానికి నాలుగు రోజుల ముందు నుంచే సందడి నెలకొంటుంది.  ఉదయాన్నే లేవడం, ఇంట్లో పనులు చక్కపెట్టుకోవడం మంచి బట్టలు వేసుకొని పల్లెటూరిలో తిరగడం ఎంజాయ్ చేయడం వంటివి చేస్తుంటారు.  ఈ పండగ రోజున అందరూ ఒకేచోట కలుసుకుంటారు కాబట్టి సమయం యిట్టె తెలియకుండా గడిచిపోతుంది.  


ఎప్పుడు తెల్లారుతుందో ఎప్పుడు రాత్రి అవుతుందో చెప్పలేం.  అందరు ఒకే ఇంటికి చేరి గతం విషయాలను, ఇప్పటి విషయాలను, కాలంలో జరగబోయే విషయాలను కూడా చర్చించుకుంటూ ఉన్నారు.  ఇక మగవాళ్ళైతే... పొలం వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు.  కోనసీమలో ఈ పండగ ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు.  కోడిపందేలు, ముగ్గులు, గొబ్బెమ్మలు, అచ్చమైన తెలుగుదనం మనకు అక్కడ కనిపిస్తుంది.  


ఇకపోతే, తెలుగు పండగ రోజున ఉదయాన్నే నిద్ర లేచి, తెల్లని బట్టలు కట్టుకొని గుడికి వెళ్లి తీర్ధప్రసాదాలు తీసుకొని ఎంజాయ్ చేయడంలో ఉండే మజా రాత్రి పగలు తేడా లేకుండా, సెల్ ఫోన్లో తలలు దూర్చి నెట్ లో బ్రౌజ్ చేస్తుంటే ఏమైనా వస్తుందా చెప్పండి.  రాదు కదా.  మరి అలాంటప్పుడు ఏం చేయాలి.  ఇంట్లో పిల్లలను తప్పకుండా పల్లెటూరికి తీసుకెళ్లాలి.  అక్కడ వాళ్లకు సంస్కృతీ సంప్రదాయాల గిరినుంచి నేర్పాలి.  అలా నేర్పిన తరువాత ఆ విషయాలు ఎందుకు వచ్చాయి.  ఎలా వచ్చాయి అనే వాటిని ఉదాహరించి చెప్పితే ... పిల్లలు తప్పకుండా వింటారు.  


అందరిని ఒకే చోట చేర్చేందుకు ఈ సంక్రాంతి పండగ బాగా ఉపయోగపడుతుంది.  సంక్రాంతి పండగ రోజున ముగ్గులు వేయడం ఓసరదా.  ముగ్గులు వేయడమే కాదు, దానిని అందంగా అలంకరించడం కూడా ఓ సరదానే.  సంక్రాంతి అంటే ఓ సరదా.. ప్రతి ఒక్కరి కళ్ళలో ఆనందం కనిపించే పండగ ఇది.  ఈ పండగ గురించి ఎందరో ఎన్నో రకాలుగా చెప్పారు.  పుస్తకాల్లో చదవడం కంటే కూడా రియల్ గా చూస్తేనే ఆ పండగ యొక్క మజా ఏంటో తెలుస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: