కనుమ అంటే అందరికి ఒకటి గుర్తొస్తుంది.  అదేమంటే, ముక్కల పండుగ.  కనుమను చాలామంది ఇలానే పిలుస్తుంటారు.  కారణం, ఆరోజున ప్రతి ఇంట్లో చికెన్, మటన్ తో నిండిపోతుంది.  మద్యం ఏరులై పారుతుంది.  మద్యం దుకాణాల వద్ద క్యూలు పెరిగిపోతాయి. ఇక కోనసీమలో పరిస్థితి గురించి చెప్పాల్సిన అవసరం లేదు.  కోడి పందేల్లో చనిపోయిన కోళ్లను శుభ్రంగా వండి వడ్డిస్తారు.  మద్యం తాగుతూ ఆ చికెన్ తింటూ ఎంజాయ్ చేస్తుంటారు.  ఇలా చేయడం వలన ఏమొస్తుంది అంటే ఆనందం వస్తుంది అంటారు.  


కొంతమంది వ్యక్తులు చికెన్ లేకుండా ముద్ద ముట్టరు.  మకర సంక్రాంతి పూర్తైన మరుసటి రోజున ముక్కలు తినడం కాదు... పశువులను అందంగా అలంకరించి పూజలు చేయాలి.  ఎందుకంటే కనుమ అన్నది పశువుల పండగ.  రైతుతో పాటుగా పశువులు కూడా పొలంలో దుక్కి దున్ని వ్యవసాయం చేసేందుకు ఎంతగానో సహకరిస్తాయి.  అందుకే పశువులను ప్రాణంగా చూసుకుంటారు.  పశువుల కోసం చాలామంది చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.  


సాయంత్రం సమయంలో ఈ పశువులను అలంకరించి ఊర్లో ఊరేగింపుగా తీసుకెళ్లి ఊరికి పరిచయం చేస్తుంటారు.  తమ పశుసంపత్తిని చాటి చెప్పేందుకు కనుమ పండుగ ఉపయోగపడుతుంది.  అంతేకాని, కనుమ అంటే ఉదయాన్నే లేచి స్నానం చేసి అలా తిరిగొచ్చి, మందు తెచ్చుకుని, మాంసం తెప్పించుకొని ఫుల్ గా తాగి తినడం కాదు.  అలా చేస్తే దాన్ని కనుమ అని చెప్పరు.  ముక్కనుమ అని అంటారు.  


ముక్కలు తినడం అలవాటైన తరువాత ముక్కనుమను కూడా పాటించడం మొదలుపెట్టారు.  కనుమ రోజు పూర్తైయ్యాక ముక్కనుమ వస్తుంది.  అంటే ముక్కలు తినడం అన్నమాట.  ముక్కల్ని తింటూ ఎంజాయ్ చేస్తుంటారు.  ఇలా తింటూ ఎంజాయ్ చేయడం వలన కలిగే ఆనందం అంతాఇంతా కాదు.  ఈ ఆనందంతోనే బ్రతికేస్తుంటారు.  రేపు కనుమ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కనుమ రోజున పశువులను తప్పకుండా పూజించాలి.  అలా చేస్తే సిరిసంపదలు కలుగుతాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: