ఒక్కరోజు బ్యాంక్ సెలవు ఉంటేనే చాలా నష్టం వస్తుంది.  అలాంటిది మూడు రోజులు వరుసగా బ్యాంకులు మూతపడితే ఇంకేమైనా ఉన్నదా చెప్పండి.  వరసగా సెలవులు రావడం అంటే మామూలు విషయం కాదు.  చాలా కష్టమైన విషయం అని చెప్పాలి. వరసగా సెలవులు రావడం ఏంటి అని షాక్ అవుతున్నారా అక్కడికే వస్తున్నా... సెలవులు అంటే మాములుగా వచ్చే సెలవులు కాదు.  ఉద్యోగులు సమ్మెకు దిగబోతున్నారు.  ఇప్పటికే దీనికి సంబంధించిన నోటీసులను కార్మిక సంఘాలు పాస్ చేశాయి.  


ఈనెల 31 వ తేదీన సమ్మె చేయబోతున్నారు.  అదే విధంగా ఫిబ్రవరి 1 వ తేదీన కూడా సమ్మెకు దిగబోతున్నారు.  ఇలా రెండు రోజులు వరసగా సమ్మె చేస్తున్నారు.   ఫిబ్రవరి 2 వ తేదీన ఆదివారం  సెలవు ఉంటుంది.  అసలు ఎందుకు ఇలా సమ్మె చేస్తున్నారు అంటే దానికి చాలా పెద్ద రీజన్ చెప్తున్నారు.  అదేమంటే, వేతన సవరణ చట్టంలో మార్పులు కావాలని, వేతనాలకు పెంచాలని కోరుతూ సమ్మె చేయబోతున్నారు.

 ఇందులో మొత్తం 9 కార్మిక సంఘాలు పాల్గొనబోతున్నాయి.  
ఈ 9 సంఘాలతో పాటుగా ఉద్యోగులు కూడా ఈ సమ్మెలో పాల్గొంటారనితెలుస్తోంది.  జనవరి 31, ఫిబ్రవరి 1 వ తేదీనే కాకుండా మార్చి 11,12,13 వ తేదీన కూడా సమ్మె చేస్తారని తెలుస్తోంది.  2020లో వేతనాలు పెంచాల్సి ఉన్నది.  కమిటీ సిఫారుసుల మేరకు వేతనాలు ఇవ్వాలని, అలా కాకుండా తగ్గిస్తే ఊరుకునేది లేదని అంటున్నారు.  అయితే, ప్రభుత్వం ఇప్పటికే బ్యాంకులను మెర్జ్ చేసేందుకు చట్టాలను తీసుకొస్తోంది. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఉన్న అప్పులను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నది.  


ఒక్క ఉద్యోగి ఉద్యోగం కూడా పోవడం జరగదని, కాకపోతే, మెర్జ్ చేయడం వలన అనేక లాభాలు కూడా ఉన్నాయని ప్రభుత్వం చెప్తున్నది.  మెర్జ్ చేస్తే, బ్యాంక్ ల మధ్య సహకారం పెరుగుతుంది.  బ్యాంక్ లావాదేవీలు పెరుగుతాయి.  అప్పులు తగ్గించుకోవచ్చు.  ఒకప్పుడు స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ అఫ్ హైదరాబాద్ లు వేరుగా ఉండేవి.  ఇప్పుడు ఇవన్నీ ఒక్కటే అయ్యాయి.  ఫలితంగా స్టేట్ బ్యాంక్ గ్రూప్ దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ గా ఆవిర్భవించింది.  మిగతా బ్యాంకులు కూడా ఇదే విధంగా ఆవిర్భవించాలి అన్నది బ్యాంకుల ఉద్దేశ్యం.

మరింత సమాచారం తెలుసుకోండి: