రాజకీయాల్లోకి వెళ్లాలని ఎవరికైనా ఉంటుంది.  పిలిచి  అవకాశం ఇస్తే ఎవరు మాత్రం ఎందుకు వదులుకుంటారు చెప్పండి.  కానీ, ఓ మహిళ మాత్రం వచ్చిన అవకాశాన్ని వదిలేసుకుంది.  తన కూతురు ఆత్మశాంతి చేకూరితే చాలు అని అంటోంది.  కూతురు ఆత్మకు శాంతి చేకూరినపుడే తనకు మనసు శాంతిగా ఉంటుందని చెప్తోంది.  గత ఏడేళ్లుగా తన కూతురును రేప్ చేసిన వ్యక్తులకు శిక్ష పడేలా చూడాలని కోరుతూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నట్టు చెప్తున్నది.  


ఎట్టకేలకు ఆమె శ్రమ ఫలించింది.  ఫిబ్రవరి 1 వ తేదీన ఉదయం 6 గంటలకు నలుగురు దోషులను ఉరి తీయాలని కోర్టు  డెత్ వారెంట్ ఇష్యూ చేసింది.  దోషులను మాములుగా ఈనెల 22 న ఉరి తీయాల్సి ఉన్నది.  కానీ, దోషులు వివిధ రకాల పిటిషన్లతో కాలయాపన చేస్తూ జీవితకాలాన్ని పెంచుకుంటూ వస్తున్నారు.  అయితే, బయట నుంచి, ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరగడంతో ఎట్టకేలకు ఉరి శిక్ష అమలు చేసేందుకు సిద్ధం అయ్యారు.  రాష్ట్రపతి కూడా దోషులను శిక్షించాలని రాష్ట్రపతి ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు.  


క్షమాభిక్షకు రాష్ట్రపతి నో చెప్పడంతో డెత్ వారెంట్ ను రిలీజ్ చేశారు.  క్షమాభిక్ష పిటిషన్ కు నో చెప్పిన 14 రోజులకు ఉరి తీయాలి.  వెంటనే ఉరి తీసేందుకు చట్టాలు ఒప్పుకోవు.  దీంతో నలుగురు దోషులను ఫిబ్రవరి 1 వ తేదీ ఉదయం 6 గంటలకు ఉరి తీయబోతున్నారు.  ఈనెల 22 ఉరి తీస్తారు అని తెలిసిన తరువాత నిర్భయ తల్లి సంతోషాన్ని వ్యక్తం చేసింది.  కానీ, తరువాత, ఉరిని ఫిబ్రవరి 1 వ తేదీకి మార్చడంతో హ్యాపీగా ఫీలవుతున్నారు. 


అయితే, ఈ ఫిబ్రవరి 1 వ తేదీనైనా ఖచ్చితంగా ఉంటుందా లేదా అన్నది చూడాలి.  అయితే, ఇకపై  కోర్టు దోషుల నుంచి ఎలాంటి పిటిషన్లు తీసుకోకుండా ఉంటె తప్పకుండా ఉరి అమలు జరుగుతుంది.  లేదంటే మాత్రం మరలా ఆలస్యం అవుతుంది.  ఆలస్యం కాకుండా చూసుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు.  ఉరికి సంబంధించిన ట్రయల్స్ ను ఇప్పటికే తీహార్ జైల్లో నిర్వహించారు.  అన్ని సిద్ధంగా ఉన్నాయి. అమలు చేయడమే ఆలస్యం.  నిందితులను ఉరి తీయబోతున్న సందర్భంగా మీడియా నిర్భయ తల్లిని పలకరించింది. రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి లేదని, తనను ఏ పార్టీ కూడా సంప్రదించలేదని, సంప్రదించారని వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: