ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ప్రభుత్వం రాజధాని అధ్యయనం కోసం నియమించిన కమిటీల  నివేదికలు అందడంతో... నివేదికలపై కేబినెట్లో చర్చించిన అనంతరం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టేందుకు జగన్ సర్కారు నిర్ణయించింది. ఇకపోతే ఈ నెల 20న క్యాబినెట్ సమావేశం నిర్వహించేందుకు జగన్ సర్కార్ నిర్ణయించింది. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మీటింగ్ విషయంలో గందరగోళం నెలకొంది. కేబినెట్ సమావేశాన్ని ఈ నెల 20న నిర్వహించనున్నట్లు గత మూడు రోజుల క్రితమే మంత్రులందరికీ సమాచారం అందించిన ప్రభుత్వం... శుక్రవారం మధ్యాహ్నం కి క్యాబినెట్ మీటింగ్ విషయంలో నిర్ణయాన్ని మార్చుకున్నది  . శనివారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో క్యాబినెట్ మీటింగ్ ఉంది అంటూ మంత్రులకు తెలియజేసింది. అయితే ఈ విషయంపై మరోసారి పునరాలోచన ప్రభుత్వం రాత్రి కల్లా ఈ నిర్ణయం మారిపోయింది. 

 

 

 అంతకు ముందు అనుకున్న విధంగానే ఈ నెల 20న సోమవారం నాడు ఉదయం 9 గంటలకు క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది అంటూ మరోసారి మంత్రులకు సమాచారం అందింది. దీంతో అటు మంత్రులతో పాటు తెలంగాణ రాజకీయాల్లో కూడా గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎందుకంటే క్యాబినెట్ మీటింగ్ అనంతరం ఏం జరగబోతుంది అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాజధాని మార్పు సంబంధించి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడానికి ముందు గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ నెల 20న జరిగే క్యాబినెట్ మీటింగ్ లో ఉదయం 9 గంటలకు రాజధాని మార్పు బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపితే... ఆ బిల్లును గవర్నర్ దగ్గరికి పంపించి  రెండు గంటల లోపు అసెంబ్లీ సమావేశాలు తీసుకు రావడంతో.. పూర్తిగా హడావుడి  వాతావరణం ఏర్పడుతుంది. అందుకే ఈ నెల 20న కాకుండా 18న క్యాబినెట్ మీటింగ్ నిర్వహించడం వల్ల... క్యాబినెట్ మీటింగ్ విషయంలో కానీ బిల్లు గవర్నర్ ఆమోదం పొందడం విషయంలో కానీ ఎలాంటి హడావిడి ఉండదని ప్రభుత్వం భావించింది. 

 

 

 అయితే రాజధాని మార్పు బిల్లుపై పూర్తి స్థాయిలో చర్చించకుండా.. క్యాబినెట్ ముందు  ప్రవేశ పెట్టడానికి కొంత సమయం తీసుకోవాలని తాజాగా జగన్ సర్కారు నిర్ణయించినట్టు తెలుస్తోంది. కాబట్టి ఈ విషయంలో నిదానంగానే వ్యవహరించాలని ప్రభుత్వం భావిస్తుందట . అందుకే క్యాబినెట్ మీటింగ్ ని ముందుగా అనుకున్నట్లు గానే ఈ నెల 20న సోమవారం నాడు ఉదయం 9 గంటలకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంత్రులకు సమాచారం కూడా పంపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: